మర్యాద రామన్న జంట మళ్లీ వస్తున్నారు  

సునీల్‌ హీరోగా సలోని హీరోయిన్‌గా నటించిన మర్యాద రామన్న సినిమా వచ్చి పది సంవత్సరాలు దాటి పోయింది.ఆ సినిమాకు రాజమౌళి దర్శకత్వం వహించిన విషయం తెల్సిందే.

TeluguStop.com - Sunil And Saloni Doing A Film In Vn Adhitya Direction

మగధీర సినిమా తర్వాత రాజమౌళి తెరకెక్కించిన సినిమా అవ్వడంతో అంచనాలు భారీగా ఉండేవి.అంచనాలను అందుకునేందుకు రాజమౌళి ఆ సినిమాను చాలా బాగా చిత్రీకరించాడు.

సునీల్‌ మరియు సలోనీకి అదో అద్బుత విజయాన్ని కట్టబెట్టింది.కాని వారిద్దరు కూడా ఆ తర్వాత ఆ విజయాన్ని కంటిన్యూ చేయలేక పోయారు.

TeluguStop.com - మర్యాద రామన్న జంట మళ్లీ వస్తున్నారు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

సునీల్‌ ఒకటి రెండేళ్లు సక్సెస్‌లతో పర్వాలేదు అనిపించినా ఆ తర్వాత అతడు కూడా నిరాశ పర్చాడు.హీరోగా సునీల్‌ కెరీర్‌కు పుల్‌ స్టాప్‌ పెట్టిక మెడియన్‌గా సినిమాలు చేస్తున్నాడు.

ఈ సమయంలో ఈయనకు వీఎన్‌ ఆధిత్య నుండి పిలుపు వచ్చింది.హీరోగా సునీల్‌కు ఆఫర్‌ను ఇచ్చిన ఆధిత్య తాజాగా హీరోయిన్‌గా సలోనికి ఆఫర్‌ ఇవ్వడం చర్చనీయాంశంగా ఉంది.

ఇది ఒక వెబ్‌ మూవీ అంటూ వార్తలు వస్తున్నాయి.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ ప్రారంభం అయ్యింది.ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లో ఈ సినిమా రూపొందుతోంది.అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా ఈ సినిమాను రూపొందిస్తున్నట్లుగా ఆధిత్య చెబుతున్నాడు.

ప్రముఖ ఓటీటీ ద్వారా విడుదల అవ్వబోతున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమా ఉంటే ఖచ్చితంగా సునీల్‌ మరి కొన్నాళ్ల పాటు హీరోగా నటించే అవకాశం ఉంటుంది.

ఒక వేళ సినిమా తలకిందులు అయితే మాత్రం ఫలితం తేడా కొడితే మాత్రం మళ్లీ సునీల్‌ కనిపించకుండా పోయే అవకాశం ఉంది.హీరోయిన్‌ సలోని పరిస్థితి కూడా అంతే.

ఈ సినిమా సక్సెస్‌ అయితేనే ఆమెకు కెరీర్‌ అనడంలో సందేహం లేదు.వీరిద్దరికి ఎంతో ముఖ్యం అయిన ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి లోనే ఓటీటీ ద్వారా విడుదల కాబోతుందట.

అయిదు కోట్ల బడ్జెట్‌ తో ఈ చిన్న సినిమాను తీస్తున్నట్లుగా చెబుతున్నారు.

#Sunil #Maryada Ramanna #Saloni #Vn Adhitya #Rajamouli

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Sunil And Saloni Doing A Film In Vn Adhitya Direction Related Telugu News,Photos/Pics,Images..