నష్టాలు తెచ్చిన సినిమాకి సీక్వెల్ ప్లాన్ చేస్తున్న దర్శక, నిర్మాత

యువ హీరో సందీప్ కిషన్ తెలుగు లో ఈ మధ్య కాలంలో వరుస సినిమాలు చేస్తున్నాడు.ఇప్పటికే నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో గల్లీ రౌడీ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని రిలీజ్ కి రెడీ అవుతుంది.

 Sundeep Kishan Maayavan Movie Sequel-TeluguStop.com

మరో వైపు విఐ ఆనంద్ దర్శకత్వంలో ఓ సూపర్ నేచురల్ ఫాంటసీ మూవీకి ఒకే చెప్పేశాడు.ఈ సినిమా కరోనా సిచువేషన్ తర్వాత స్టార్ట్ అవ్వబోతుందని క్లారిటీ ఇచ్చేశారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు మరో సినిమాకి కూడా సందీప్ కిషన్ ఒకే చెప్పేశాడు.తెలుగుతో పాటు తమిళ్ లో కూడా సందీప్ కిషన్ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.

 Sundeep Kishan Maayavan Movie Sequel-నష్టాలు తెచ్చిన సినిమాకి సీక్వెల్ ప్లాన్ చేస్తున్న దర్శక, నిర్మాత-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రస్తుతం క్రేజీ దర్శకుడుగా ఉన్న లోకేష్ కనగరాజ్ మొదటి సినిమాని సందీప్ కిషన్ తోనే తెరకెక్కించారు.నగరం టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమాతో దర్శకుడు లోకేష్ కి కోలీవుడ్ లో మంచి గుర్తింపు వచ్చింది.

అలాగే సీవీ కుమార్ దర్శకత్వంలో మాయవన్ అనే సినిమాని కూడా సందీప్ కిషన్ చేశాడు.

థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో డిజాస్టర్ కావడంతో పాటు నిర్మాతకి కూడా భారీ నష్టాలు మిగిల్చింది.

నిర్మాతగా సక్సెస్ లు అందుకున్న సీవీ కుమార్ ఈ మాయావన్ సినిమాతో దర్శకుడుగా ప్రయాణం మొదలు పెట్టాడు.నాలుగేళ్ల క్రితం ఈ సినిమా రిలీజ్ అయ్యి డిజాస్టర్ అయ్యింది.

ఇదిలా ఉంటే సీవీ కుమార్ సందీప్ కిషన్ తోనే ఇప్పుడు మాయవన్ సీక్వెల్ ని ఎనౌన్స్ చేశాడు.అది కూడా ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కించడానికి రెడీ కావడం విశేషం.

మాయవన్ – రీలోడెడ్ టైటిల్ తో సీక్వెల్ ప్రకటించారు.తిరుకుమారన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై తన స్వీయ దర్శకత్వంలో తెలుగు తమిళ కన్నడ హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా రూపొందుతుందని కుమార్ వెల్లడించారు.

మరి ఫ్లాప్ అయిన సినిమాకి సీక్వెల్ ఎనౌన్స్ చేసారంటే ఈ సారి కథలో కచ్చితంగా ఏదో ఇంటరెస్టింగ్ ఉండే ఉంటుందనే టాక్ ఇప్పుడు వినిపిస్తుంది.

#MaayavanMovie #Sundeep Kishan #Kollywood #Pan India Movie #CV Kumar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు