సందీప్ కిషన్ కు ఇదైనా గట్టేక్కిస్తుందా..?

టాలెంట్ బాగానే ఉన్నా సరైన సక్సెస్ లు లేక కెరియర్ లో వెనకపడ్డాడు సందీప్ కిషన్.ఈమధ్యనే A1 ఎక్స్ ప్రెస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సందీప్ కిషన్ తన నెక్స్ట్ సినిమా గల్లీ రౌడీ సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాడు.

 Sundeep Kishan Full Hopes On Gully Rowdy , Gully Rowdy ,sundeep Kishan ,sundeep-TeluguStop.com

జి నాగేశ్వర్ రెడ్డి డైరక్షన్ లో కామెడీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 17న థియేట్రికల్ రిలీజ్ అవుతుంది.మాస్ కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతున్న సినిమా ట్రైలర్ మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదగా రిలీజ్ చేశారు.

ఇక సినిమాలైతే చేస్తున్నాడు కాని సరైన హిట్టు లేక సతమతమవుతున్న సందీప్ కిషన్ కు ఈ గల్లీ రౌడీ అయినా సరే హిట్ ట్రాక్ ఎక్కిస్తుందో లేదో చూడాలి.నిను వీడని నీడను నేను సినిమాతో పర్వాలేదు అనిపించిన సందీప్ కిషన్ సినిమాలు చేస్తున్నా సరే ఫలితాలు నిరాశపరుస్తున్నాయి.

మరి సందీప్ కిషన్ కోరుకునే హిట్ గల్లీ రౌడీతో వస్తుందా లేదా అన్నది చూడాలి.ఎంవివి సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమాలో సందీప్ కిషన్ కు జోడీగా నేహా శెట్టి నటిస్తుంది.

సినిమాలో బాబి సింహా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube