తూచ్.. ఉదయ్ కిరణ్‌తో సంబంధం లేదన్న హీరో

గతకొద్ది రోజులుగా యంగ్ హీరో సందీప్ కిషన్ ఒకప్పటి హీరో ఉదయ్ కిరణ్ బయోపిక్‌లో నటిస్తున్నట్లు వార్తలు ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొట్టాయి.ఇది చివరకు సందీప్ కిషన్ వరకు చేరడంతో ఆయన ఈ సినిమాపై స్పందించాడు.

 Sundeep Kishan Denies Rumours Of Doing Uday Kiran Biopic-TeluguStop.com

తనకు ఇప్పట్లో బయోపిక్‌ సినిమాలు చేసే ఆలోచన లేదని సందీప్ తెలిపాడు.

దీంతో ఉదయ్ కిరణ్ బయోపిక్ చిత్రం మరోసారి డైలమాలో పడింది.

సందీప్ కిషన్ ఈ బయోపిక్ చిత్రం చేస్తాడంటూ వార్తలు రావడంతో దాదాపు ఇదే ఫిక్స్ అని అందరూ అనుకున్నారు.కానీ ఈ సినిమా చేయడం లేదంటూ సందీప్ కిషన్ కుండ బద్దలు కొట్టడంతో ఇప్పుడు ఉదయ్ కిరణ్ బయోపిక్ ఎవరు చేస్తారా అనే సందేహం అందరిలో మొదలైంది.

కాగా సందీప్ ప్రస్తుతం తన నెక్ట్స్ సినిమాను రెడీ చేసే పనిలో పడ్డాడు.తన నెక్ట్స్ మూవీ హీకీ ఆటను ఆధారం చేసుకుని ఉంటుందని సందీప్ తెలిపాడు.

మరి ఉదయ్ కిరణ్ బయోపిక్ మరోసారి అటెకెక్కినట్లేనా అని సినీ జనం ప్రశ్నిస్తున్నారు.ఈ సినిమాను మరోసారి తెరపైకి ఎవరు తెస్తారో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube