వీకెండ్ కలెక్షన్స్‌లా మారిన కరెంట్ బిల్లులు  

Sundeep Kishan Comment On Electricity Bill, Sundeep Kishan, Electricity Bill, Lockdown, Tollywood News - Telugu Electricity Bill, Lockdown, Sundeep Kishan, Tollywood News

కరోనా వైరస్ కారణంగా గత రెండు నెలలుగా అందరూ ఇళ్లకే అతుక్కుపోయిన విషయం తెలిసిందే.దేశవ్యాప్తంగా ఈ లాక్‌డౌన్ అమలులో ఉండటంతో ప్రముఖుల దగ్గర్నుండి సామాన్యుల వరకు అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు.

 Sundeep Kishan Comment On Electricity Bill

ఇక ఈ లాక్‌డౌన్ చాలా మందికి చాలా కష్టాలను తీసుకొచ్చింది.ముఖ్యంగా కరెంట్ బిల్లుల రూపంలో ఈ లాక్‌డౌన్ తెచ్చిన తంటాలు అంతా ఇంతా కాదు.

సామాన్య ప్రజల దగ్గర్నుండి సెలబ్రిటీల వరకు లాక్‌డౌన్ కారణంగా అధిక విద్యుత్ బిల్లులు చెల్లించక తప్పడం లేదు.విద్యుత్ మీటర్ రీడింగ్ సిబ్బంది కరోనా కారణంగా తమ విధులు చేయబోరని, మూడు నెలలకు గాను యావరేజ్ రూపంలో బిల్లులు వస్తాయని విద్యుత్ అధికారులు ప్రకటించారు.

వీకెండ్ కలెక్షన్స్‌లా మారిన కరెంట్ బిల్లులు-Gossips-Telugu Tollywood Photo Image

కానీ వారు చెప్పిన దానికి, బిల్లులు వచ్చిన తీరుకి చాలా తేడా ఉంది.ఈ సమస్య పలానా రాష్ట్రంలో అని కాకుండా దేశవ్యాప్తంగా నెలకొంది.ఇక ఈ విద్యుత్ బిల్లుల బాధితుల్లో సినీ ప్రముఖులు కూడా ఉన్నారు.

ఇటీవల కార్తీకా నాయర్, తాప్సీలు తమ విద్యుత్ బిల్లులు ఎక్కువగా వస్తున్నాయని కుర్రోమొర్రో అన్నారు.

అయినా వారి బాధలను ఎవరూ పట్టించుకోలేదు.ఇక తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ కూడా ఈ విద్యుత్ బిల్లు బాధితుడిగా మారాడు.

తనకు వచ్చిన విద్యుత్ బిల్లు చూస్తే ఇదేదో వీకెండ్ సినిమా కలెక్షన్లలా ఉందని ఆయన సెటైర్ విసిరాడు.విద్యుత్ బిల్లుల కోసం ఆన్‌లైన్ వార్ మొదలైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఆయన అన్నాడు.

కాగా సందీప్ కిషన్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

#Sundeep Kishan #Lockdown

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Sundeep Kishan Comment On Electricity Bill Related Telugu News,Photos/Pics,Images..