A1 ఎక్స్‌ప్రెస్ ట్రైలర్ టాక్: సందీప్ కిషన్ గట్టిగా కొట్టేలా ఉన్నాడు!

యంగ్ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ మొదట్నుండీ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యింది.ఇక ఈ సినిమాను పూర్తిగా స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతుండటంతో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి.

 Sundeep Kishan A1 Express Trailer Impressive-TeluguStop.com

ఇక ఈ సినిమాలో సందీప్ కిషన్ హాకీ ప్లేయర్‌గా నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.కాగా ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర యూనిట్ తాజాగా రిలీజ్ చేసింది.

ఈ ట్రైలర్ ఆద్యంతం ఎంటర్‌టైనింగ్‌గా ఉండటంతో ఈ సినిమాను చూసేందుకు ఆడియెన్స్ ఆసక్తిని చూపుతున్నారు.ఇక ఈ ట్రైలర్ చూస్తుంటే, హాకీ గేమ్ కోసం సందీప్ కిషన్ పడే తపన ప్రేక్షకులను కట్టిపడేయడం ఖాయమని తెలుస్తోంది.

హాకీ ఆట కోసం ఎలాంటి రాజకీయాలను సందీప్ కిషన్ ఎదుర్కొన్నాడనేది మనకు ఈ సినిమాలో చూపించనున్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.కాగా ఈ సినిమా కోసం సందీప్ కిషన్ భారీ మేకోవర్ చేశాడు.

అందాల భామ లావణ్య త్రిపాఠీ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోండగా, ఆమె కూడా ఈ సినిమాలో ఓ హాకీ ప్లేయర్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది.

డెన్నిస్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండగా సందీప్ కిషన్ ఈ సినిమాను స్వయంగా ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

కాగా ఈ సినిమాకు హిప్‌హాప్ తమిళ సంగీతం అందిస్తున్నాడు.ఈ సినిమాను ఫిబ్రవరిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

మరి స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందీప్ కిషన్, ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో సినిమా రిలీజ్ అయ్యాక తెలుస్తుంది.ఇక సోషల్ మీడియాలో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఏ1 ఎక్స్‌ప్రెస్ చిత్ర ట్రైలర్‌ను మీరూ ఓసారి చూసేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube