A1 ఎక్స్‌ప్రెస్ ట్రైలర్ టాక్: సందీప్ కిషన్ గట్టిగా కొట్టేలా ఉన్నాడు!  

A1 ఎక్స్‌ప్రెస్ ట్రైలర్ టాక్: సందీప్ కిషన్ గట్టిగా కొట్టేలా ఉన్నాడు! - Telugu A1 Express, Lavanya Tripathi, Sundeep Kishan, Tollywood News

యంగ్ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ మొదట్నుండీ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యింది.ఇక ఈ సినిమాను పూర్తిగా స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతుండటంతో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి.

TeluguStop.com - Sundeep Kishan A1 Express Trailer Impressive

ఇక ఈ సినిమాలో సందీప్ కిషన్ హాకీ ప్లేయర్‌గా నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.కాగా ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర యూనిట్ తాజాగా రిలీజ్ చేసింది.

ఈ ట్రైలర్ ఆద్యంతం ఎంటర్‌టైనింగ్‌గా ఉండటంతో ఈ సినిమాను చూసేందుకు ఆడియెన్స్ ఆసక్తిని చూపుతున్నారు.ఇక ఈ ట్రైలర్ చూస్తుంటే, హాకీ గేమ్ కోసం సందీప్ కిషన్ పడే తపన ప్రేక్షకులను కట్టిపడేయడం ఖాయమని తెలుస్తోంది.

TeluguStop.com - A1 ఎక్స్‌ప్రెస్ ట్రైలర్ టాక్: సందీప్ కిషన్ గట్టిగా కొట్టేలా ఉన్నాడు-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

హాకీ ఆట కోసం ఎలాంటి రాజకీయాలను సందీప్ కిషన్ ఎదుర్కొన్నాడనేది మనకు ఈ సినిమాలో చూపించనున్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.కాగా ఈ సినిమా కోసం సందీప్ కిషన్ భారీ మేకోవర్ చేశాడు.

అందాల భామ లావణ్య త్రిపాఠీ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోండగా, ఆమె కూడా ఈ సినిమాలో ఓ హాకీ ప్లేయర్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది.

డెన్నిస్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండగా సందీప్ కిషన్ ఈ సినిమాను స్వయంగా ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

కాగా ఈ సినిమాకు హిప్‌హాప్ తమిళ సంగీతం అందిస్తున్నాడు.ఈ సినిమాను ఫిబ్రవరిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

మరి స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందీప్ కిషన్, ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో సినిమా రిలీజ్ అయ్యాక తెలుస్తుంది.ఇక సోషల్ మీడియాలో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఏ1 ఎక్స్‌ప్రెస్ చిత్ర ట్రైలర్‌ను మీరూ ఓసారి చూసేయండి.

#A1 Express #Sundeep Kishan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు