ఏ1 ఎక్స్ ప్రెస్ తొలిరోజు కలెక్షన్లు అంత తక్కువా..?

కరోనా విజృంభణ, లాక్ డౌన్ నిబంధనల వల్ల దాదాపు ఎనిమిది నెలలు మూతబడిన థియేటర్లకు కేంద్రం గతేడాది అక్టోబర్ నెలలో 50 శాతం ఆక్యుపెన్సీతో అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే.అయితే 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లను రన్ చేయడానికి థియేటర్ యజమానులు ఆసక్తి చూపించలేదు.

 Sundeep Kishan A1 Express Movie First Day Collections-TeluguStop.com

అయితే సంక్రాంతి సినిమాలకు పరవాలేదనిపించే స్థాయిలో కలెక్షన్లు రావడం, ఫిబ్రవరి 1 నుంచి 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లకు అనుమతులివ్వడంతో దర్శకనిర్మాతలు తమ సినిమాలను థియేటర్లలో విడుదల చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.

అయితే సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా కలెక్షన్లను చూస్తే తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు థియేటర్లలో సినిమాలు చూడటానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదని అర్థమవుతుంది.

 Sundeep Kishan A1 Express Movie First Day Collections-ఏ1 ఎక్స్ ప్రెస్ తొలిరోజు కలెక్షన్లు అంత తక్కువా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సినిమా తొలిరోజు కలెక్షన్లు కోటి రూపాయల లోపే కావడం గమనార్హం.సినిమాకు పాజిటివ్ టాక్ రాగా క్రిటిక్స్ నుంచి కూడా పాజిటివ్ రివ్యూలు వచ్చాయి.ఈ సినిమా తొలిరోజు షేర్ 0.76 లక్షలు కావడం గమనార్హం.

Telugu 0.76 Crore Rupees, A1 Express Movie, First Day Collection, Sundeep Kishan-Movie

నైజాంలో ఈ సినిమాకు 24 లక్షల రూపాయలు రాగా ఉభయగోదావరి జిల్లాల్లో 13.8 లక్షలు, సీడెడ్ ఏరియాలో ఎనిమిది లక్షలు, మిగిలిన ఏరియాల్లో 32 లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి.హాకీ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందో లేదో చూడాల్సి ఉంది.సందీప్ కిషన్ ఈ సినిమాలోని పాత్ర క్జోసం ఎంతో శ్రమించారు.

అయితే మంచి టాక్ వచ్చినా ఆశించిన స్థాయిలో కలెక్షన్లు లేకపోవడం గమనార్హం.

నిన్న విడుదలైన సినిమాల్లో ఈ సినిమాకు మాత్రమే పాజిటివ్ టాక్ వచ్చింది.

వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తరువాత సరైన సక్సెస్ లేక కెరీర్ విషయంలో ఇబ్బందులు పడుతున్న సందీప్ కిషన్ కు ఏ1 ఎక్స్ ప్రెస్ కలెక్షన్ల పరంగా సక్సెస్ ను ఇస్తుందో లేదో చూడాల్సి ఉంది.

#Sundeep Kishan #FirstDay

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు