ఏ1 ఎక్స్‌ప్రెస్ ప్రీ-రివ్యూ.. సందీప్ కిషన్ గోల్ కొట్టేలా ఉన్నాడే!

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఏ1 ఎక్స్‌ప్రెస్ మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.గతేడాదే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది.

 Sundeep Kishan A1 Express Exclusive Pre-review, Sundeep Kishan, A1 Express, Lava-TeluguStop.com

అయితే ఈ సినిమాతో ఖచ్చితంగా హిట్ కొట్టి అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇవ్వాలని సందీప్ కిషన్ చూస్తు్న్నాడు.ఇక ఈ సినిమాను పూర్తిగా స్పోర్ట్స్ బ్యాక్‌గ్రౌండ్‌తో తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

అయితే ఈ సినిమాపై భారీ నమ్మకం పెట్టుకున్నాడు హీరో సందీప్ కిషన్.కానీ అతడు పెట్టుకున్న నమ్మకాలు ఈ సినిమాతో ఎంతవరకు నెరవేరుతాయనేది ప్రేక్షకుల్లో పెద్ద ప్రశ్నగా మిగిలింది.

కానీ ఈ సినిమాతో సందీప్ ఖచ్చితంగా హిట్ కొడతాడని అంటున్నారు సినీ విశ్లేషకులు.అందుకు కారణం ఈ సినిమా కథే అని వారు చెబుతున్నారు.తమిళంలో సూపర్ హిట్ చిత్రంగా నిలిచిన ‘నట్పె తునై’కు తెలుగు రీమేక్‌గా ఈ సినిమా వస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా తమిళనాట ప్రేక్షకులను మెప్పించడంలో పూర్తిగా సక్సెస్ అయ్యింది.

ఈ సినిమా కథ ఓ హాకీ ఆటకు సంబంధించిన ప్లేగ్రౌండ్ చుట్టూ ఉండటం, దాన్ని కాపాడుకునేందుకు ఓ కోచ్ చేసే ప్రయత్నం, ఆయనకు తోడుగా ఓ నిషేధింపబడ్డ ఆటగాడు నిలవడంతో ఈ సినిమా కథ చాలా అద్భుతంగా ఉంటుంది.

కాగా ఏ1 ఎక్స్‌ప్రెస్ కథ కూడా ఇదే అనే విషయం మనకు చిత్ర టీజర్, ట్రైలర్లు చూస్తే ఇట్టే అర్థమవుతుంది.

మరి ఈ సినిమాలో సందీప్ కిషన్ ఎందుకు బ్యాన్ చేయబడ్డాడు, అతడు తిరిగి హాకీ స్టిక్ పడతాడా లేడా, లావణ్య త్రిపాఠీకి ఈ సినిమాలో ఎలాంటి పాత్ర దక్కింది అనే అంశాలు తెలియాలంటే మాత్రం ఏ1 ఎక్స్‌ప్రెస్ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.ఇక ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు రామ్ పోతినేని గెస్ట్‌గా వచ్చి ఆల్ ది బెస్ట్ చెప్పిన సంగతి తెలిసిందే.

ఈ సినిమా పూర్తి రివ్యూ కోసం తెలుగుస్టాప్.కామ్‌ను తప్పక ఫాలో అవ్వండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube