ఎండకి చర్మం రంగు మారుతోందా? ఇవిగోండి అద్భుత ఉపాయాలు     2018-05-12   01:18:43  IST  Lakshmi P

వేసవి నట్టనడి స్టేజిలో ఉంది. సహజంగా మే రెండొవ వారం, మూడోవ వారం ఎండ తీవ్రత ఉచ్చస్థాయికి వెళుతుందని చెబుతారు. ఈసారి కూడా పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. భానుడి భగభగకి భయపడి సాధ్యమైనంత వరకు ఎండలో బయటకి వెళ్ళే ప్రయత్నాలు మానేస్తున్నా, పనులన్ని వాయిదా వేసుకోని ఇంటిపట్టునే కూర్చోని ఉండలేం కదా‌. ఇక ఔట్ డోర్ పనులు చేసేవారి పని మరింత దారుణం.

-

నీళ్ళు బాగా తాగి వెళితే సన్ స్ట్రోక్ ని నివారించడం సాధ్యపడుతుందేమో కాని, సన్ బర్న్ నుంచి మాత్రం తప్పించుకోవడం మాత్రం కొంచెం కష్టమే. ఈ సన్ బర్న్ అంటే ఏమిటి? ఏమి లేదు, ఎండ తీవ్రత వలన చర్మం యొక్క రంగుతో పాటు టెక్చర్ మారడం. అంటే ఎర్రగా మండుతున్నట్టు అయిపోవడం, లేదా నల్లగా మాడిపోయినట్టు అయిపోవడం. కొందరికైతే చర్మం ఉబ్బుతుంది కూడా.

సన్ బర్న్ వలన కేవలం చర్మానికే నష్టం, మిగితా శరీరం బాగానే ఉంటుందని అని కూడా అనుకోకండి. చర్మ సమస్యలు మాత్రమే కాదు, ఇంకా ఉన్నాయి.

* సన్ బర్న్ వలన తలనొప్పి వేయవచ్చు. కొందరికి ఇది తీవ్రస్థాయిలో ఉంటుంది. అంటే ఎండలో మీరు గడిపిన సమయాన్ని బట్టి.

* రెండు నిమిషాల క్రితం నీళ్ళు తాగిన దాహమేస్తుంది. అది మామూలుగా ఉండదు. తీవ్రస్థాయిలో ఉంటుంది. గొంతు ఆరిపోయిన సెన్సెషన్ ఉంటుంది.

* వాంతులు అవుతాయి. మూర్ఛ కూడా రావొచ్చు. తీవ్రమైన అలసట ఉండొచ్చు.

* స్కిన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇందులో మరో విడ్డూరమైన విషయం ఏమిటంటే, తెల్లగా, ఎర్రగా ఉండే వారిలో ఈ అవకాశాలు ఇంకా ఎక్కువ.

ఇక చర్మ సమస్యల దగ్గరికి తిరిగి వస్తే ముఖం మీద కూడా దురద పుట్టవచ్చు. కొందరికి చర్మం ఊడుతున్నట్లు ఉంటుంది. మంట, దురద, నొప్పి .. అబ్బో .. ఇంకా చాలానే ఉంటాయి.

అసలు ఈ సన్ బర్న్ ఎందుకు వస్తుంది అంటే సింపుల్ గా ఎండ వలన అని చెప్పొద్దు. కాస్తైనా విజ్ఞానం ఉండాలి కదా. అల్ట్రా వాయిలేట్ రేస్ (UV Rays) తాకిడికి ఇలా అవుతుంది. సూర్యుడి నుంచి వెలువడే ఈరకం కిరణాలు చర్మానికి బద్ధ శతృవులు. ఈ కిరణాల వలనే చర్మం రంగులో మార్పులు, చర్మం యొక్క టెక్చర్ లో మార్పులు, మంట, మొటిమలు, పొక్కులు… ఇలా అన్ని వీటివల్లే.

-

ఈ UV కిరణాల నుంచి మిమ్మల్ని మీరు ఎలా సంరక్షించుకోవాలి?

* ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య UV రేస్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో బయటకి సాధ్యమైనంత వరకు వెళ్ళకండి.

* సన్ స్కీన్ లోషన్ వాడటం అలవాటు చేసుకోవాలి. La Shield Sun Screen Gel SPF40, ఈ లోషన్ రూ.670 నుంచి రూ.750 మధ్య దొరుకుతుంది. తక్కువ ధరలో లభ్యమై, చర్మానికి కవచంలా పనిచేస్తుంది.

* ఇక ముఖానికి మాస్క్ వాడటం, నెత్తికి టోపి వాడటం లాంటివి మీకు తెలుసు.

సన్ బర్న్ బారిన పడితే ఏం చేయాలి?

* చర్మం మండుతోందని వెంటనే ఐస్ క్యూబ్ లను తీసుకొచ్చి రుద్దడం చేయవద్దు. చన్నీటి స్నానం చేయండి.

* ద్రవ పదార్థాలు తీసుకుంటూ ఉండండి. మంచినీటితో పాటు కొబ్బరినీళ్ళు ఉండాలి.

* విటమిన్ సి తీసుకోవాలి. Limcee 500MG లాంటి టాబ్లేట్స్ చాలా చవకగా దొరుకుతాయి. విటమిన్ సి సెరమ్ తో రోజు చర్మానికి మర్దన చేయాలి‌. మళ్ళీ మీ రంగు మీకు వచ్చే మార్గం ఇదే.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.