మంత్రి మల్లారెడ్డికి ఐటీ అధికారుల సమన్లు

తెలంగాణ మంత్రి మల్లారెడ్డికి ఐటీ అధికారులు సమన్లు జారీ చేశారు.అదేవిధంగా మల్లారెడ్డి ఇద్దరు కుమారులు, అల్లుడుతో పాటు వియ్యంకుడు లక్ష్మారెడ్డికి సమన్లు అందించారు.

 Summons Of It Officials To Minister Mallareddy-TeluguStop.com

సోమవారం విచారణకు హాజరుకావాలని నోటీసులలో పేర్కొన్నారు.ఇప్పటికు మల్లారెడ్డి ఆస్తులపై ఐటీ శాఖ నజర్ వేసింది.

ఈ మేరకు గత రెండు రోజులుగా సోదాలు నిర్వహించింది.మల్లారెడ్డితో పాటు ఆయన సన్నిహిత బంధువుల ఇళ్లల్లో, మల్లారెడ్డి కార్యాలయాల్లో తనిఖీలు చేసింది.

మల్లారెడ్డి సమీప బంధువైన సంతోష్ రెడ్డి నివాసంలో ఐటీ తనిఖీలు నిర్వహించింది.ఈ క్రమంలో సుమారు రూ.4 కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు.పలు డాక్యుమెంట్లను రెట్రివ్ చేసినట్లు సమాచారం.

అదేవిధంగా ప్రవీణ్ ఇంట్లోనూ ఐటీ సోదాలు చేసింది.మల్లారెడ్డి యూనివర్సిటీకి సంబంధించిన అన్ని వ్యవహారాలను ప్రవీణ్ రెడ్డే చూస్తారని తెలుస్తోంది.కాగా మొత్తం ఐటీ దాడుల్లో ఇప్పటివరకు రూ.8.80 కోట్లకు పైగా నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.పన్ను ఎగవేత, మేనేజ్ మెంట్ కోటా కింద సీట్ల అమ్మకాలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై ఆరా తీసినట్లు సమాచారం.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube