వేసవి చర్మ సమస్యలకు చెక్ పెట్టాలంటే... పేస్ పాక్స్   Summer Home Made Face Packs     2018-03-19   22:16:42  IST  Lakshmi P

వేసవికాలం వచ్చేసింది. ఈ కాలంలో అనేక రకాలైన చర్మ సమస్యలు వస్తాయి. ఈ కాలంలో చర్మం పట్ల శ్రద్ద పెట్టకపోతే చర్మం నిర్జీవంగా మారటమే కాకుండా ముడతలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వేసవికాలంలో చర్మంపై కొంచెం శ్రద్ద పెడితే చాలు. మెరిసే కాంతివంతమైన చర్మాన్ని పొందవచ్చు. ఈ చిట్కాల కోసం ఉపయోగించే అన్ని వస్తువులు మనకు ఇంటిలో అందుబాటులో ఉంటాయి. వాటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

ఒక స్పూన్ నిమ్మరసంలో ఒక స్పూన్ తేనే,ఒక స్పూన్ గుడ్డు తెల్లసొన వేసి బాగా కలిపి ముఖానికి,మెడకు పట్టించి అరగంట అయ్యాక సాధారణ నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఒక స్పూన్ పుదీనా పేస్ట్ లో అరస్పూన్ పసుపు వేసి బాగా కలిపి ముఖానికి రాసి 15 నిమిషాల తర్వాత సాధారణ నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ వేసవిలో వచ్చే పొక్కులను కూడా తగ్గిస్తుంది.

రెండు స్పూన్ల పెరుగులో ఒక స్పూన్ శనగపిండి కలిపి పేస్ట్ గా తయారుచేయాలి. ఈ పేస్ట్ ని ముఖానికి రాసి 20 నిమిషాల తర్వాత సాధారణ నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ వేసవిలో వచ్చే స్కిన్ ట్యానింగ్ ని తొలగించటంలో సమర్ధవంతంగా పనిచేస్తుంది.

అరటిపండును గుజ్జుగా చేసి తేనే కలిపి ముఖానికి పట్టించి ఆరాక సాధారణమైన నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ మృత కణాలను తొలగించటంలో సహాయపడుతుంది.