వేసవికాలంలో విపరీతమైన వేడి జుట్టు మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి.ఈ కాలంలో కొన్ని చిట్కాలను పాటిస్తే జుట్టుకు ఎటువంటి సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు.
ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.వేసవికాలంలో జుట్టు ఆరబెట్టటానికి బ్లోయర్స్ వాడకూడదు.
బ్లోయర్స్ వాడితే జుట్టుకు తీవ్రమైన నష్టం కలుగుతుంది.అందువల్ల జుట్టు సాధారణ గాలికి ఆరే విధంగా చూసుకోవాలి.
ఎక్కువగా ఎండలో తిరగకూడదు.
జుట్టుకు హెయిర్ సీరంను రాస్తూ ఉండాలి.
ఇలా రాస్తూ ఉంటే జుట్టు కుదుళ్ళు తేమగా ఉంటాయి.అంతేకాక జుట్టుకు మంచి పోషణను అందిస్తుంది.
అయితే మీ జుట్టు తత్వానికి సెట్ అయ్యే హెయిర్ సీరంని కొనుగోలు చేసి ఉపయోగించాలి.ఎండలో బయటకు వెళ్ళేటప్పుడు స్కార్ఫ్ లేదా టోపీతో జుట్టును కవర్ చేయాలి.
ఈ విధంగా చేయకపోతే జుట్టు వేడి గాలికి కఠినంగా మారిపోతుంది.
ఈ వేసవికాలంలో జుట్టును ఆలా వదిలేయకుండా ముడి లేదా అల్లుకోవటం చేయాలి.ఈ విధంగా చేయటం వలన జుట్టు ఊడిపోవటం అరికట్టడమే కాదు, జుట్టు చిందరవందర అయి, చిక్కుపడటం నుంచి కూడా కాపాడుతుంది.ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరి నూనెను గోరువెచ్చగా చేసి రాత్రి సమయంలో జుట్టుకు పట్టించి పది నిమిషాల పాటు మసాజ్ చేయాలి.
జుట్టుకి పోషణ ఇవ్వటమే కాకుండా వేసవి వేడి నుండి జుట్టును కాపాడుతుంది.అలాగే జుట్టుకు తేమను అందించే హెయిర్ మాస్క్ లను ఉపయోగించాలి.