సుమంత్ 'మళ్లీ' సెంటిమెంట్ ను నమ్ముకున్నాడా..?

అక్కినేని ఫ్యామిలీ హీరో సుమంత్ తన హిట్ సినిమా సెంటిమెంట్ కొనసాగిస్తున్నాడు.అతని కెరియర్ కు మంచి బూస్టింగ్ ఇచ్చిన సినిమా మళ్లీ రావా.

 Sumanth Malli Sentiment For His Next Movie Malli Modalaindi-TeluguStop.com

ఆ సినిమాతో సుమంత్ మళ్లీ కెరియర్ మీద ఆశలు పెంచుకున్నాడు.అయితే ఆ సినిమా హిట్ అయినా సరే సుమంత్ మరోసారి రొటీన్ సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించలేదు.

ఈ క్రమంలో కొద్దిపాటి గ్యాప్ తో మరోసారి తన మళ్లీ సెంటిమెంట్ తో ఆడియెన్స్ ను బుట్టలో పడేయాలని చూస్తున్నాడు అక్కినేని హీరో తన కొత్త సినిమా టైటిల్ పోస్టర్ తో షాక్ ఇచ్చాడు సుమంత్.ఇంతకీ టైటిల్ ఏంటో తెలుసా మళ్లీ మొదలైంది.

 Sumanth Malli Sentiment For His Next Movie Malli Modalaindi-సుమంత్ మళ్లీ’ సెంటిమెంట్ ను నమ్ముకున్నాడా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

టీజీ కీర్తి కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో సుమంత్ సరసన నైనా గంగూలీ హీరోయిన్ గా నటిస్తుంది.

అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాను రెడ్ సినిమాస్ బ్యానర్ లో చరణ్ తేజ్ నిర్మిస్తున్నారు.

లైఫ్ ఆఫ్టర్ డైవర్స్ అంటూ మళ్లీఎ మొదలైంది పోస్టర్ తో వచ్చారు సుమంత్.పోస్టర్ ఇట్రెస్టింగ్ గా ఉండగా సుమంత్ కు ఈ మళ్లీ సెంటిమెంట్ హిట్ అందిస్తుందో లేదో చూడాలి.

ఈ సినిమాతో పాటుగా సుమంత్ అనగనగా ఒక రౌడీ సినిమాలో కూడా నటిస్తున్నాడు.సుమంత్ మళ్లీ మొదలైంది, అనగనగా రౌడీ ఈ రెండు సినిమాలతో అయినా కెరియర్ హిట్ ట్రాక్ లో పడేలా చేసుకుంటాడో లేదో చూడాలి.

#Sumanth #AnaganagaOka #Sumanth #Akkineni #SumanthMalli

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు