కపటధారితో సుమంత్ హిట్ కొట్టేలా ఉన్నాడే!  

అక్కినేని కాంపౌండ్ హీరోగా సుమంత్ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు.సాఫ్ట్ హీరోగా కేవలం సెలెక్టెడ్ మూవీస్‌ను చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు.

TeluguStop.com - Sumanth Kapatadhaari Censor Report Is Positive

కాగా ఇటీవల కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలకే ప్రాధాన్యత ఇస్తూ వస్తున్న సుమంత్, తాజాగా కపటధారి అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో రాబోతున్నాడు.ఈ సినిమా షూటింగ్ పనులను ఇప్పటికే ముగించుకోగా, తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులు కూడా పూర్తి చేసుకుంది.
సెన్సార్ బోర్డు వారు ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్‌ను జారీ చేశారు.ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని వారు కితాబిచ్చారు.పూర్తి క్రైమ్ థ్రిల్లర్ మూవీగా ఈ సినిమాను తెరకెక్కి్స్తున్న చిత్ర యూనిట్, ఈ సినిమాతో అదిరిపోయే హిట్ అందుకునేందుకు రెడీ అవుతోంది.కాగా ఈ సినిమాలో సుమంత్ పాత్ర చాలా వైవిధ్యంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

ఆయన పర్ఫార్మెన్స్ ఈ సినిమాకు కీలకంగా కానుందని, ఆయన కనబరిచిన ఎక్స్‌ప్రెషన్లు ప్రేక్షకులను ఖచ్చితంగా అలరిస్తాయని చిత్ర వర్గాలు అంటున్నాయి.
కన్నడలో సూపర్ హిట్ మూవీగా నిలిచిన ‘కవటధారి’కి తెలుగు రీమేక్‌గా సినిమా వస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి రిజల్ట్‌ను దక్కించుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

TeluguStop.com - కపటధారితో సుమంత్ హిట్ కొట్టేలా ఉన్నాడే-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఈ సినిమాను ప్రదీప్ కృష్ణమూర్తి డైరెక్ట్ చేస్తుండగా, ధనంజయన్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.ఈ సినిమాలో అందాల భామ నందితా శ్వేతా, పూజా కుమార్‌లు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

కాగా ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.గతంలో సుమంత్ నటించిన సుబ్రహ్మణ్యపురం, ఇదంజగత్ వంటి చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ కావడంతో ఇప్పుడు మరోసారి తన స్ట్రాటెజీ కంటెంట్ చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఈ హీరో.

మరి ఈసారి కూడా సుమంత్‌కు ప్రేక్షకులు పాస్ మార్కులు వేస్తారా లేరా అనేది చూడాలి.

#Censor #Sumanth #Kapatadhaari

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు