సుమంత్ కపటధారి మూవీ హిట్టా..? ఫ్లాపా..?

దాదాపు రెండు దశాబ్దాల క్రితమే హీరోగా కెరీర్ ను మొదలుపెట్టినా సత్యం, గోదావరి, మళ్లీరావా మినహా సుమంత్ కెరీర్ లో చెప్పుకోదగ్గ సినిమాలు లేవు.కథల ఎంపికలో లోపాలే సుమంత్ కెరీర్ కు మైనస్ గా మారాయి.

 Sumanth Kapatadari Gets Mixed Talk From Audience,sumanth, Tollywood,kapata Dari,-TeluguStop.com

సుమంత్ హీరోగా నటించిన సినిమాల్లో హిట్ల కంటే ఫ్లాపులే ఎక్కువగా ఉన్నాయి.అయితే ఈసారి సుమంత్ రొటీన్ సినిమాలకు భిన్నంగా కపటధారి అనే క్రైమ్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

కన్నడలో హిట్టైన కవలుధారి సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాపై ట్రైలర్ బాగుండటంతో బాగానే అంచనాలు ఏర్పడ్డాయి.సినిమాలో సుమంత్ ట్రాఫిక్ ఎస్సైగా గౌతమ్ పాత్రలో నటించారు.

ట్రాఫిక్ డిపార్టుమెంట్ లో అసంతృప్తిగా పని చేసే గౌతమ్ కు క్రైమ్ విభాగంలో పని చేయాలనే కోరిక ఉంటుంది అయితే ఉన్నతాధికారులు అంగీకరించకపోవడం వల్ల అతను ట్రాఫిక్ కే పరిమితం కావాల్సి వస్తుంది.

Telugu Sumanth, Kapatadari-Movie

అయితే ఒకరోజు మెట్రో కొరకు తవ్వకాలు జరపగా ఆ తవ్వకాల్లో మూడు అస్థి పంజరాలు బయటపడటంతో పాటు ఆ అస్థి పంజరాలు 40 సంవత్సరాల క్రితం అస్థి పంజరాలని తేలుతుంది.ఆ కేసును చేధించాలనే ప్రయత్నం చేసిన గౌతమ్ ఆ ప్రయత్నంలో సక్సెస్ అయ్యాడా ? కేసు చేధించే సమయంలో గౌతమ్ కు ఎలాంటి ఆవాంతరాలు ఎదురయ్యాయి ? 40 సంవత్సరాల క్రితం చనిపోయిన వ్యక్తులెవరు ? నేరం చేసిన వ్యక్తులను గౌతమ్ పట్టుకున్నాడా ? అనే ప్రశ్నలకు సమాధానమే కపటధారి కథ.

ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు మిక్స్ డ్ రెస్పాన్స్ వస్తోంది.కథలో ట్విస్టులు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, క్లైమాక్స్ సినిమాకు హైలెట్ గా నిలవగా ఫస్ట్ హాఫ్, స్లోగా సాగే కథనం సినిమాకు మైనస్ గా మారాయి.సుమంత్ బాగానే నటించినా కథనం విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది.

బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా యావరేజ్ గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube