సుమంత్‌ భగీరథ ప్రయత్నంలో భాగంగా ఈ సారి 'కపటధారి'

అక్కినేని ఫ్యామిలీ నుండి హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన వారిలో ముందు ఉండే హీరో సుమంత్‌.ఈయన సుదీర్ఘ కాలం క్రితం హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.

 Sumanth Kapatadhaari First Look Release,akkineni Hero, Kapatadhaari, Traffic Cop-TeluguStop.com

నాగార్జున కెరీర్‌ ఆరంభంలో చేసిన సినిమాల్లో కూడా ఈయన నటించాడు అంటే ఎప్పటి నుండి ఈయన నటిస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు.చేసిన దాదాపు అన్ని సినిమాలు కూడా బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడుతున్నాయి.

అయినా కూడా తన భగీరథ ప్రయత్నం మాత్రం మానుకోవడం లేదు.ఈసారి కపటధారి అనే టైటిల్‌ తో ఈయన సినిమాను చేసి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.

ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ ను నాగచైతన్య చేతుల మీదుగా విడుదల చేయించారు.సినిమాలో సుమంత్‌ ట్రాఫిక్‌ పోలీసు తరహాలో కనిపించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.ఫస్ట్‌ లుక్‌ చూస్తుంటే ఇందులో మ్యాటర్‌ ఏమైనా ఉంటుందేమో అంటూ ఇప్పటి నుండే ప్రేక్షకులు అంచనాలు పెట్టుకుంటున్నారు.ఇదే కనుక సక్సెస్‌ అయితే సుమంత్ ఇప్పటి నుండి అయినా కాస్త సీరియస్‌ గా వరుసగా సినిమాలు చేసే అవకాశం ఉంది.

Telugu Akkineni, Kapatadari, Kapatadhaari, Nagachaitanya, Sumanth, Cop-

పొరపాటున ఈ సినిమా ఫలితం తారు మారు అయితే మళ్లీ రెండు మూడు సంవత్సరాల వరకు సుమంత్‌ కనిపించక పోవచ్చు అంటున్నారు.అక్కినేని హీరోల టైం ఈమద్య కాలంలో బాగున్నట్లుగా లేదు.ఒకప్పుడు టాలీవుడ్‌ లో దుమ్ము రేపిన అక్కినేని హీరోలు ఇప్పుడు మాత్రం సక్సెస్‌ లు లేక దిక్కులు చూసే పరిస్థతి వచ్చింది అంటున్నారు.సుమంత్ కొత్త సినిమా వచ్చే ఏడాదిలో విడుదల చేస్తారా లేదంటే ఓటీటీ లో విడుదల చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube