అక్కినేని హీరో మళ్లీ ఏదో ప్రయోగం చేయబోతున్నాడే!

అక్కినేని ఫ్యామిలీ నుండి సుమంత్‌ హీరోగా ఎంట్రీ ఇచ్చి చాలా సంవత్సరాలు అయ్యింది.ఇండస్ట్రీలో వారసత్వంతో ఎంట్రీ ఇచ్చిన ఈయన అసలు సక్సెస్ లు అనేవి లేకుండా ఇన్నాళ్లు కెరీర్‌ ను కొనసాగిస్తూ వస్తున్నాడు.

 Sumanth Akkineni Aham Reboot Movie Glimps , Aham Reboot , Aham Reboot Movie Fi-TeluguStop.com

సినిమాల్లో ఈయన సాధిస్తున్న పరాజయాలు చూసి చాలా మంది ముక్కున వేలేసుకుంటున్నారు.అయినా కూడా ఏమాత్రం మొహమాటం లేకుండా కొత్త సినిమాలను చేస్తూ సక్సెస్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు.

నిజంగా సుమంత్‌ ప్రయత్నాలను అభినందించాల్సిందే. ఎందుకంటే ఇబ్బంది అనుకోకుండా చాలా మంది సినిమా ఇండస్ట్రీ ని వదిలి పెట్టి వెళ్లి పోతున్నా కూడా తనకు సినిమా పై ఉన్న అభిరుచి మరియు అభిమానంతో సినిమా ల్లో నటిస్తూ వస్తున్నాడు.

చేసిన ప్రతి సారి కూడా చాలా విభిన్నమైన సినిమాలను పండించడం ఆయన శైలి. కమర్సియల్‌ గా ప్లాప్ అయినా కూడా మంచి సినిమా లు చేశాడు అంటూ ఈమద్య కాలంలో టాక్ దక్కించుకుంటున్నాడు.

అందుకే ఖచ్చితంగా సుమంత్‌ ముందు ముందు అయినా మంచి కమర్షియల్‌ హిట్‌ సినిమా లను ఆయన చేస్తాడేమో అంటూ కామెంట్స్ వస్తున్నాయి.సోషల్‌ మీడియాలో అక్కినేని ఫ్యామిలీ హీరోకు ఫాలోయింగ్‌ బాగానే ఉంది.

అందుకే తాజాగా ఆయన కొత్త సినిమా అహం రీబూట్ అనే సినిమాను ప్రకటించిన వెంటనే మంచి స్పందన వచ్చింది.సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్ మరియు గ్లిమ్స్ ను విడుదల చేసి అందరి దృష్టిని ఆకర్షించారు.

ప్రస్తుతం సినిమాకు సంబంధించిన షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది.త్వరలోనే సినిమా ను విడుదల చేయబోతున్న డేట్ కూడా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అహం రీబూట్‌ గురించిన చర్చ జరుగుతోంది.ఇదో వైవిధ్యభరిత సినిమా అన్నట్లుగా ఉంటుందని అక్కినేని హీరో ఈసారి సక్సెస్ కొట్టేలా ఉన్నాడు అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube