రాజశేఖర్‌పై సుమన్‌ వ్యాఖ్యలు.. అతడికి అంత సీన్‌ అవసరం లేదు  

తెలుగు బుల్లి తెరపై ఎన్నో టాక్‌ షో లు వచ్చాయి.కాని అన్నింటికి చాలా విభిన్నంగా ఉండేది అందరు ఆసక్తి చూసేది అలీతో సరదాగా.

TeluguStop.com - Suman Comments On Rajashekhar In Alitho Saradaga Talk Show

ఈ షోలో సినీ ప్రముఖులను అలీ తీసుకు వచ్చి ఇంటర్వ్యూలు చేస్తూ ఉన్నాడు.ఈవారం కోట శ్రీనివాసరావు మరియు బాబు మోహన్‌లు వచ్చారు.

వీరిద్దరితో అలీ టాక్‌ షో చాలా సరదాగా సాగింది.ఇక వచ్చే వారం సీనియర్‌ హీరోలు అయిన సుమన్‌ మరియు భానుచందర్‌ లతో అలీ టాక్‌ షో సాగబోతుంది.

TeluguStop.com - రాజశేఖర్‌పై సుమన్‌ వ్యాఖ్యలు.. అతడికి అంత సీన్‌ అవసరం లేదు-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇప్పటికే అందుకు సంబంధించిన ప్రోమో వచ్చింది.ప్రోమోలో వచ్చే వారం ఎపిసోడ్‌కు సంబంధించి ఆసక్తి కలిగించడంలో సక్సెస్‌ అయ్యారు.

సుమన్‌ సినీ కెరీర్‌ లో చాలా కీలకమైన విషయాలను ఈ సందర్బంగా చెప్పినట్లుగా అనిపించింది.అదే మాదిరిగా రాజశేఖర్‌తో సుమన్‌ కు విభేదాలు క్లీయర్‌గా ఉన్నాయి అంటూ తాజా ఎపిసోడ్‌ తో క్లారిటీ వచ్చేసింది.

సాయి కుమార్‌ విషయంను అలీ తీసుకు వచ్చిన సమయంలో ఈ విషయం బయటకు వచ్చింది.

సుమన్‌ మరియు రాజశేఖర్‌లకు సాయి కుమార్‌ డబ్బింగ్‌ చెప్పేవాడు.ఇద్దరు కూడా హీరోలుగా పీక్స్‌లో ఉన్న సమయంలో సాయి కుమార్‌ ఇద్దరికి డబ్బింగ్‌ చెప్పడం జరిగింది.కాని ఆ విషయం ఇద్దరికి నచ్చేది కాదు.

సాయి కుమార్‌ నాకు ఒక్కడికే డబ్బింగ్‌ చెప్పాలంటే నాకు మాత్రమే డబ్బింగ్‌ చెప్పాలని అనుకునేవారట.సుమన్‌ ఆ విషయమై స్పందిస్తూ.

ఔను సాయికుమార్‌ గొప్ప గొప్ప వారికి డబ్బింగ్‌ చెబుతున్నాడు.తమిళంలో సీనియర్‌ హీరోలకు కూడా ఆయన డబ్బింగ్‌ చెప్పాడు.

అలాంటి సమయంలో చిన్న చిన్న వారికి డబ్బింగ్‌ చెప్పడం ఎందుకు అంటూ నేను అన్నాను.అంటే రాజశేఖర్‌ చిన్న హీరో అవ్వడం వల్ల ఆయనకు సాయి కుమార్‌ డబ్బింగ్‌ చెప్పడం పై సుమన్‌ అభ్యంతరం వ్యక్తం చేశాడు.

ఇప్పటికి కూడా సుమన్‌ అదే మాట మీద ఉన్నాను అన్నాడు.పెద్ద వారికి గొంతు ఇస్తున్నప్పుడు చిన్న నటీనటులకు ఇచ్చి ఆ గొంతు విలువ పోగొట్టడం ఎందుకు అంటూ సుమన్‌ అభిప్రాయం వ్యక్తం చేశాడు.

ఇక భాను చందర్‌ వల్లే తాను ఇండస్ట్రీకి వచ్చాను అంటూ సుమన్‌ చెప్పడం జరిగింది.

#Suman #Rajashekhar #Bhanuchandar #Sai Kumar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు