సింగర్ సునీత కి అదిరే గిఫ్ట్ ఇచ్చిన సుమక్క..! అదేంటంటే..?!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన సంగీతంతో అందరిని ఆకట్టుకున్న సింగర్ సునీతకు 19 సంవత్సరాల వయసులోనే ప్లేబ్యాక్ సింగర్ గా పేరుగాంచి తనకంటూ ఇండస్ట్రీలో ఓ మంచి పేరు సంపాందించుకుంది.అతి తక్కువ సమయంలోనే సింగర్ సునీత ఎన్నో సినీ అవార్డులను సొంతం చేసుకుంటూ, మరోవైపు ఎందరో నటీమణులకు తన గాత్ర దానం చేసింది సునీత.

 Sumakka Gives Adire Gift To Singer Sunita That Is, Singer Sunitha-ram, Marraige,-TeluguStop.com

తన కెరియర్ సజావుగా కొనసాగుతున్నప్పటికీ, తన వైవాహిక జీవితంలో మాత్రం సమస్యలు ఎదురుకునేది.మొదటి భర్తతో మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకుని తన పిల్లలతో జీవనం కొనసాగించేది.

తాజాగా సింగర్ సునీత ఓ డిజిటల్ మీడియా అధినేత రామ్ ను వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.వీరిద్దరికీ జనవరి 9న వివాహం అంగరంగ వైభవంగా నిర్వహించారు.

ముందుగా అనుకున్న ప్రకారం జనవరి 9న రాం – సింగర్ సునీత వివాహం పూర్తి అయ్యింది.

Telugu Anchor Suma, Friend, Marraige, Sunitha, Surprize Gift-Latest News - Telug

వీరి వివాహం శంషాబాద్ సమీపంలోని అమ్మపల్లి లోని సీతారామచంద్ర స్వామి ఆలయంలో నిర్వహించారు.కరోనా వైరస్ కారణంగా చాలా తక్కువ మంది కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య వీరి వివాహం జరిగింది. సింగర్ సునీత కు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది క్లోజ్ గా ఉన్నప్పటికీ కరోనా వైరస్ కారణంగా సినీ ప్రముఖులను కొందరికి మాత్రమే వివాహ వేడుకకు హాజరయ్యారు.

వివాహ సందర్భంగా తన క్లోజ్ ఫ్రెండ్ ఆయన యాంకర్స్ ఝాన్సీ, సుమ వివాహ వేడుకలో సందడి చేశారు.ఈ తరుణంలో తన సునీత క్లోజ్ ఫ్రెండ్ అయిన సుమ ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చినట్లుగా సమాచారం.

ఇంతకీ ఏమిటా ఆ సర్ప్రైజ్ గిఫ్ట్ అని అనుకుంటున్నారా.? ఖరీదైన వజ్రాల నక్లెస్ ఇచ్చినట్లు సమాచారం.సుమ, సునీత వీరిద్దరూ కూడా దాదాపు 25 సంవత్సరాలుగా స్నేహితులు, ఆ పైగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube