యంగ్‌ హీరో సినిమాలో సుమ 'వాయిస్‌' కీలక పాత్ర

తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు సుమ సుపరిచితం.చిన్న వారి నుండి ముసలి వారి వరకు సుమను గుర్తిస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

 Suma Voice Over In Sandeep Kishan A1 Express Movie-TeluguStop.com

తన షో లతో పాటు తన స్టేజ్‌ కార్యక్రమాలతో సుమ చేసే సందడి అంతా ఇంతా కాదు.పెద్ద ఎత్తున సుమ చేస్తున్న కార్యక్రమాలతో ఆమె మరింతగా తెలుగు ప్రేక్షకులకు దగ్గర అవుతూనే ఉంది.

తాజాగా ఈమె ఒక కీలక పాత్రలో యంగ్‌ హీరో సినిమాలో కనిపించేందుకు ఓకే చెప్పినట్లుగా సమాచారం అందుతోంది.గతంలో సుమ పలు సినిమాల్లో నటించారు.

 Suma Voice Over In Sandeep Kishan A1 Express Movie-యంగ్‌ హీరో సినిమాలో సుమ వాయిస్‌’ కీలక పాత్ర-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాని ఈమద్య కాలంలో మాత్రం ఆమె సినిమా లు చేసింది లేదు.సందీప్ కిషన్‌ హీరోగా రూపొందుతున్న ఎ1 ఎక్స్ ప్రెస్ సినిమా లో హాకీ మ్యాచ్‌ ఉంటుందట.

ఆ మ్యాచ్‌ కు కామెంట్రీ చెప్పడం కోసం సుమను ఎంపిక చేశారంటూ వార్తలు వస్తున్నాయి.

హాకీ మ్యాచ్‌ నేపథ్యంలో సాగుతున్న సినిమా అవ్వడంతో క్లైమాక్స్ దాదాపుగా 20 నుండి 30 నిమిషాల పాటు హాకీ మ్యాచ్‌ ఉంటుందట.

ఆ మ్యాచ్ లో సుమ యాంకరింగ్ సీరియస్ గా సాగడంతో పాటు అప్పుడప్పుడు ఎంటర్‌ టైన్‌ మెంట్‌ ఉంటుందని అంటున్నారు.ఎక్కువ సేపు సీన్స్ ఉండటం వల్ల ప్రేక్షకులు బోర్‌ ఫీల్‌ కాకుండా ఉండే ఉద్దేశ్యంతో సుమ వాయిస్ ను కీలక పాత్రగా పెట్టినట్లుగా చెబుతున్నారు.

స్ర్కీన్‌ పై సుమ కనిపించేది రెండు మూడు నిమిషాలే అయినా వినిపించేది మాత్రం 20 నిమిషాలకు ఏక్కువే.అందుకే ఖచ్చితంగా ప్రేక్షకులు ఆమె వాయిస్ ను ఎంజాయ్‌ చేయడంతో పాటు హాకీ మ్యాచ్ ను తెగ ఆస్వాదిస్తారని అంటున్నారు.

సందీప్‌ కిషన్‌ కు జోడీగా ఈ సినిమా లో లావణ్య త్రిపాఠి నటిస్తున్న విషయం తెల్సిందే.భారీ అంచనాలున్న ఈ సినిమా ను త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.

#Lavanya Tripati #Suma #Suma Voice Over

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు