'నరేష్'ను పిచ్చ కొట్టుడు కొట్టిన యాంకర్ సుమ.. కారణం ఏంటో తెలుసా?

ఆమె మాటల్లో హాస్యం ఉట్టిపడుతుంది.ఆమె చేతల్లో అల్లరి తనం.

 Suma Slapped Naresh,anchor Suma,naresh,cash Show,slapped,tollywood-TeluguStop.com

అందరినీ కడుపుబ్బానవ్విస్తూ అందరినీ ఎంటర్ టైన్ మెంట్ చేయడంలో ఆమెకు సాటి ఎవరూ లేరనిపించేలా చేస్తూ అందరినీ కట్టిపడేస్తుంటుంది.ఆవిడేనండి బుల్లి తెర మీద తన క్రేజ్ ను అంచలంచెలుగా పెంచుకుంటూ వెలుతున్న వ్యక్తి సుమ కనకాల.

తెలుగు పరిశ్రమలో ఎంత మంది యాంకర్లున్నా నాకు మించి ఎవరూ చేయలేరనే విధంగా తను ప్రత్యేకమైన వ్యక్తిగా గుర్తించబడుతూ ఎంతో మంది హృదయాల్లో చోటు దక్కించుకుంది యాంకర్ సుమ.

ఏ ఈవెంట్ అయినా సరే, ఏ ప్రోగ్రాం అయినా సరే ఆమెనే యాంకరింగ్ చేయాల్సిందే.ఎన్నో చిన్న నుంచి అతిపెద్ద ప్రోగ్రాంల వరకూ అన్నింట్లోనూ ఆమెచేతే యాంకరింగ్ చేయించుకునేలా ఎదిగారు ఆమె.స్టార్ మహిళతో ప్రతి ఇంటికీ చేరువైంది సుమ కనకాల. ఆ ఒక్క దానితో ఆగకుండా ఎన్నో ప్రోగ్రాంలను చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదిచుకుంది.కాగా ఈ టీవీ మా టీవీ అన్ని చానల్లోనూ దూసుకుపోతోంది.

కాగా ఈ టీవీలో ఎంటర్ టైన్ మెంట్ కు కేరాఫ్ నిలుస్తున్న షో ‘క్యాష్ దొరికినంత దోచుకో’.

ఈ షో ద్వారా సుమ కనకాల వెండితెర, బుల్లితెరలో పేరు సంపాదించుకున్న వారితో ఈ షో నిర్వహిస్తూ ఎంతగానో నవ్విస్తూ కవ్విస్తూ ఉంటుంది.

ఎంతో క్రేజ్ సంపాదించుకున్న ఈ షోలో సుమ చేసే అల్లరి ఆమె మాటలక గారడీకి అందరూ ఫిదా అవ్వాల్సిందే.ఎన్నో ఏండ్ల నుంచి చేస్తున్నా తన పనిలో మాత్రం ఏమాత్రం అలసట చూపించని తత్వం తనది.

కాగా ఈ షో లో ఎంతో మంది సెలబ్రీటీలు వచ్చి అందరినీ నవ్వించారు.అలాగే ఎప్పటిలాగే శనివారం రాబోయే ఈ షోలో వచ్చే కంటెస్టెంట్లతో మరింతగా నవ్వించడానికి సిద్ధమైంది సుమ కనకాల.

ఎంతో మందిని తమ నటనద్వారా అభిమానులను సంపాదించుకున్న నరేశ్, రిత్విక, యోధ, దీవెనలు ఈ షోలో అల్లరి పువ్వులు పూయించడానికి సిద్ధమయ్యారు.కాగా ఈ షోలో సుమా, ఈ అల్లరి పిల్లలు కలిసి ఆన్లైన్ క్లాసెస్ కాన్సెప్ట్ తో స్కిట్ చేయనున్నారు.

అలాగే సుమా, నరేష్ మధ్యలో వచ్చే పంచులు అందరినీ ఆకట్టుకున్నాయి.అలాగే సుమ నరేశ్ పద్యం చెప్పమని కోరగా.నరేశ్ ఒక లైలా కోసం పాట అందుకుంటాడు.దాంతో సుమ నరేశ్ ను అలా సరదాగా కొడతారు.

కాని మొత్తానికి ఈ షో లో నవ్వులను పండించడాని వచ్చే శనివారం క్యాష్ షో సంసిద్దమైంది.ఈ ప్రోమోను మీరు కూడా చూసేయండి మరి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube