మీ రొమాన్స్ చూడలేక చావాలి ఆ జంట పై షాకింగ్ కామెంట్స్ చేసిన సుమ!

బుల్లితెరపై సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి కార్యక్రమాలలో క్యాష్ కార్యక్రమం ఒకటి.ఈ కార్యక్రమం ద్వారా ప్రతి వారం ప్రేక్షకులను తనదైన శైలిలో సందడి చేస్తూ ఉంటారు.

 Suma Shocking Comments On Umadevi Lobo In Cash Program Details, Suma,shocking Comments,romance.,cash In Programs,suma Shocking Comments ,umadevi Lobo ,cash Program, Umadevi Lobo Romance-TeluguStop.com

ఇకపోతే సుమ కార్యక్రమానికి పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కోసం సెలబ్రిటీలు హాజరవుతూ ఉంటారు.అలాగే మరి కొంతమంది బుల్లితెర సెలబ్రిటీలను ఈమె ఈ కార్యక్రమానికి ఆహ్వానించి పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తుంటారు.

ఈ క్రమంలోనే తాజాగా ఈవారం ప్రసారం కాబోయే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు ఈ ప్రోమోలో భాగంగా బుల్లితెర నటీనటులు హాజరైనట్టు తెలుస్తుంది.

 Suma Shocking Comments On Umadevi Lobo In Cash Program Details, Suma,shocking Comments,romance.,Cash In Programs,suma Shocking Comments ,umadevi Lobo ,cash Program, Umadevi Lobo Romance-మీ రొమాన్స్ చూడలేక చావాలి ఆ జంట పై షాకింగ్ కామెంట్స్ చేసిన సుమ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ ప్రోమోలో బిగ్ బాస్ ద్వారా గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఉమాదేవి లోబో కూడా హాజరయ్యారు.

బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో అవకాశమందుకున్న వీరిద్దరూ బిగ్ బాస్ హౌస్ లో చేసిన హంగామా అందరికీ తెలిసిందే.బిగ్ బాస్ వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడిపి పెద్ద ఎత్తున రచ్చ చేశారు.

వీరి లవ్ ట్రాక్ చూసిన నేటిజన్స్ లేటు వయసులో ఈ రొమాన్స్ ఏంటి అంటూ మండిపడ్డారు.అయితే వీరి రొమాన్స్ చూడలేక రెండవ వారమే బిగ్ బాస్ హౌస్ నుంచి ఉమాదేవిని బయటకు పంపారు.

బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన కొన్ని రోజులకు ఉమాదేవి పలు బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేశారు.ఈ మధ్యకాలంలో ఈమె పూర్తిగా బుల్లితెర కార్యక్రమాలకు దూరమయ్యారు.ఈ క్రమంలోనే తాజాగా సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న క్యాష్ కార్యక్రమానికి వీరిద్దరూ రావడంతో మరోసారి ఈ జంట తమ రొమాన్స్ తో రెచ్చిపోయారు.పక్కన సుమ ఉన్నారనే విషయాన్ని కూడా మర్చిపోయి వీరు రొమాంటిక్ మూడ్లోకి వెళ్లిపోవడంతో సుమ ఎపిసోడ్ మొత్తం మీ రొమాన్స్ చూడలేక చచ్చిపోవాలి అంటూ తనదైన శైలిలో వీరిపై కామెంట్ చేశారు.

ప్రస్తుతం ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube