మీ టైమ్ అయిపోయిందాంటూ నోరు జారిన యాంకర్ సుమ?

బుల్లితెరపై యాంకర్ సుమ హవా ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఏదైనా ఒక కార్యక్రమానికి సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు అంటే దర్శకనిర్మాతలు ఆ కార్యక్రమం గురించి ఎలాంటి గాబరాపడాల్సిన అవసరం లేదని ప్రశాంతంగా ఉంటారు.

 Suma Shocking Comments In Cash Latest Promo On Senior Actress Shiva Parvathi-TeluguStop.com

ఎందుకంటే సుమ ఎంతో నిబద్ధతతో, ఎలాంటి తప్పులు లేకుండా స్క్రిప్టు ప్రకారం ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారనే నమ్మకం దర్శకనిర్మాతలలో ఉంటుంది.కానీ కొన్నిసార్లు మన ప్రమేయం లేకుండానే కొన్ని తప్పులు దొర్లుతుంటాయి.

ఈ విధంగానే సుమ ప్రమేయం లేకుండా.పొరపాటున సుమ కూడా ఓ విషయంలో నోరు జారడంతో ఒక్కసారిగా అక్కడున్న వారందరూ ఎంతో షాక్ అయ్యారు.

 Suma Shocking Comments In Cash Latest Promo On Senior Actress Shiva Parvathi-మీ టైమ్ అయిపోయిందాంటూ నోరు జారిన యాంకర్ సుమ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సుమ క్యాష్ ప్రోగ్రామ్ కి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఈ వారం ప్రసారం కాబోయే కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు.

ఈ ప్రోమోలో భాగంగా సీనియర్ నటీ నటులు గౌతమ్ రాజు, బాబు మోహన్, రాజ్యలక్ష్మి, శివ పార్వతి వచ్చారు.వీరందరితో కలిసి ఎంతో సరదాగా సందడిగా చేసిన సుమ ఎప్పటిలాగే వారి పై పంచులు వేస్తూ అందరిని నవ్వించారు.

ఇలా సరదాగా అందరితో కబుర్లు చెబుతూ ఒక టాస్క్ లో భాగంగా నటి శివపార్వతిని స్టేజ్ పైకి పిలిచారు.

Telugu Anchor Suma, Babu Mohan, Cash Latest Promo, Cash Show, Comment, Gowtham Raju, Rajya Lakshmi, Shiva Pravathi, Tollywood-Movie

ఈ టాస్క్ లో భాగంగానే సుమ శివ పార్వతిని ఉద్దేశించి “మీ టైం అయిపోయింది అంటూ“నోరు జారారు.సుమ అన్న ఈమాటకు వెంటనే శివ పార్వతి అదేంటి.అలా అనేసావు అని వెంటనే అడగడంతో సుమ ఈ టాస్క్ లో మీ టైం అయిపోయింది అంటూ యథా విధిగా కవర్ చేశారు.

Telugu Anchor Suma, Babu Mohan, Cash Latest Promo, Cash Show, Comment, Gowtham Raju, Rajya Lakshmi, Shiva Pravathi, Tollywood-Movie

నేను ఇంకా ఇండస్ట్రీలో చాలా సంవత్సరాలు ఉందామనుకున్నాను… కానీ అప్పుడే నా టైం అయిపోయిందంటావా.అంటూ అక్కడి నుంచి మొసలి కన్నీరు కారుస్తూ శివపార్వతి వెళ్లారు.ఏది ఏమైనా ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.సుమ పొరపాటున అన్న ఈ డైలాగ్ ఈ ప్రోమోలో హైలెట్ గా మారిపోయిందని చెప్పవచ్చు.

#Babu Mohan #Anchor Suma #Cash Promo #Rajya Lakshmi #Gowtham Raju

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు