వంటలక్కతో సుమక్క... ఫోటో నెట్టింట వైరల్!

సుమ కనకాల ఈ పేరు ఎవరికీ తెలియకుండా ఉండదు.అన్ని తెలుగు టెలివిజన్ కార్యక్రమాలలో నెంబర్ వన్ యాంకర్ గా ఎన్నో సంవత్సరాల నుంచి టెలివిజన్ కార్యక్రమాలలో రాణిస్తున్నారు.

 Premi Viswanath With Suma, Television Star Woman,karthika Deepam Serial Deepa W-TeluguStop.com

అంతేకాకుండా ఏ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ కైనా, ప్రమోషన్ కైనా, సుమ వ్యాఖ్యాతగా మనకు దర్శనమిస్తారు.పుట్టింది కేరళ లో అయినా అచ్చ తెలుగు అమ్మాయిల ఎంతో స్పష్టంగా తెలుగు మాట్లాడుతూ అందరినీ ఆకట్టుకొని బుల్లితెర స్టార్ మహిళగా పేరు పొందారు.
వంటలక్క పాత్రలోఎంతో మంది తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్న కార్తీకదీపం సీరియల్ దీప గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.ఆ సీరియల్ లో దీప, వంటలక్క పాత్రలో తన నటనతో జీవించి అందరినీ ఆకట్టుకుంది.

కేవలం వంటలక్క పాత్ర కారణంగా మా టీవీలో నెంబర్ వన్ సీరియల్ రేటింగ్స్ ను సంపాదించుకుంది.విడివిడిగా ఇంతటి ఫాలోయింగ్ ఉన్న సుమ కనకాల, వంటలక్క ఇద్దరూ కలిసి ఒకే వేదికపై సందడి చేస్తే ఎలా ఉంటుంది? ఇద్దరు కలిసి నిర్వహించే ఆ షోకివచ్చే కిక్కే వేరుగా ఉంటుంది.ఈ ఇద్దరూ ఒకే కార్యక్రమం నిర్వహిస్తే వీరి అభిమానులలో పండుగ వాతావరణం నెలకొంటుంది.

వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటో ఒకటి సుమ షేర్ చేస్తూ… వీరిద్దరూ కలిసి ఏం చేస్తున్నారు ఊహించండి అంటూ పేర్కొన్నారు.

వీరిద్దరూ కలిసి ఏదైనా షో చేస్తున్నారా? లేదా ఏ ఈవెంట్ లో అయినా పాల్గొంటున్నారా అన్న విషయం తెలియలేదు.ప్రస్తుతం వీరిద్దరి మీద షూటింగ్ జరుగుతున్న విషయం మాత్రం తెలియడంతో వీరిద్దరి అభిమానులు ఆ ఆనంద సమయం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

ఏది ఏమైనా వీరిద్దరూ కలిసి నటించే ఆ కార్యక్రమం ద్వారా వీరి అభిమానుల్లో ఆనందాన్ని రెట్టింపు చేస్తారని అనిపిస్తోంది.అయితే ఆ సమయం కోసం కొన్ని రోజులు వేచి ఉండాల్సిందేనని చెబుతున్నారు.

అయితే ప్రస్తుతం వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటో మాత్రం వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube