సుమకు పోటీగా మారిన రాజీవ్ కనకాల.. ఏం చేశారంటే..?

యాంకర్ సుమ ప్రస్తుతం ఈ ఛానల్ ఆ ఛానల్ అనే తేడాల్లేకుండా అన్ని ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్ లోప్రోగ్రామ్స్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.సుమ భర్త రాజీవ్ కనకాల పరిమితంగా సినిమాల్లో నటిస్తున్నా గుర్తింపు తెచ్చిపెట్టే పాత్రలలో ఎక్కువగా నటిస్తున్నారు.

 Suma Kanakala Tough Fight With Rajeev To Host The Rechipdam Brother Show In Etv,-TeluguStop.com

ఇప్పటివరకు వెండితెరకే పరిమితమైన రాజీవ్ కనకాల బుల్లితెరపై బిజీ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు.రెచ్చిపోదాం బ్రదర్ పేరుతో రాజీవ్ కనకాల హోస్ట్ గా చేయనున్నారు.

ఈటీవీ ప్లస్ ఛానల్ లో సోమవారం నుంచి శుక్రవారం వరకు ఈ షో ప్రసారం కానుండటం గమనార్హం.ప్రముఖ నిర్మాణ సంస్థలలో ఒకటైన మల్లెమాల సంస్థ ఈ షోను నిర్మిస్తోంది.

నిన్న ప్రసారమైన ఎపిసోడ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడం గమనార్హం.యాంకర్ సుమకు రాజీవ్ కనకాల తన హోస్టింగ్ తో గట్టి పోటీని ఇస్తుండటం గమనార్హం.

గతంలో ఈటీవీ ప్లస్ లో ప్రసారమైన పటాస్ ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.

Telugu Etv Channel, Suma Kanakala, Tough-Movie

ప్రస్తుతం పటాస్ కు బదులుగా ఈ షో ప్రసారమవుతుండగా ఈ షో హిట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.రాజీవ్ కనకాల ఈ ప్రోగ్రామ్ తరువాత హోస్ట్ గా బిజీ అవుతారేమో చూడాల్సి ఉంది.మరోవైపు రాజీవ్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటిస్తున్నారని తెలుస్తోంది.

ఒకవైపు వెండితెర ఆఫర్లతో మరోవైపు బుల్లితెర ఆఫర్లతో రాజీవ్ కనకాల బిజీ అవుతున్నారు.

Telugu Etv Channel, Suma Kanakala, Tough-Movie

గతంలో రాజీవ్ కనకాల సుమ యాంకర్ గా చేసిన చాలా షోలకు గెస్ట్ గా హాజరయ్యారు.అయితే రెచ్చిపోదాం బ్రదర్ షో ఏ స్థాయిలో టీఆర్పీ రేటింగ్ లను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది.రాజీవ్ కనకాల అన్ని విధాలుగా సక్సెస్ అవుతుండటం గమనార్హం.

నిన్న ప్రసారమైన ఎపిసోడ్ కు సుమ గెస్ట్ గా హాజరయ్యారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube