కనకాల ఫ్యామిలీ నుంచి హీరో వచేస్తున్నాడా..?!  

Anchor suma kanakala son Roshan to Introduce as hero in Tollywood, roshan kanakala, anchor suma, rajiv kanakala, tollywood, movie debut - Telugu Anchor Suma, Movie Debut, Rajiv Kanakala, Roshan Kanakala, Tollywood

బాలీవుడ్, టాలీవుడ్ ఇలా ఏ చిత్రసీమ అయినా సరే ఎంతో మంది వెండితెరకు వారి పెద్దవారి నుండి వారసత్వం తీసుకొని ఎంతోమంది హీరో హీరోయిన్లుగా చలామణి అవుతున్నారు.ఇదేమి మనకు కొత్తేం కాదు.

TeluguStop.com - Suma Kanakala Son Roshan Hero Tollywood

తరాలు మారుతున్న కొద్దీ వారసులు ఇండస్ట్రీలోకి వస్తూనే ఉన్నారు.అయితే అలా వచ్చిన వారిలో చాలామంది నిలదొక్కుకోలేక సినిమాలు తీయడం మానేస్తున్నారు.

చాలా కొద్ది మంది మాత్రమే ఆ అదృష్టం ఉంటేనే వారు సినిమా పరిశ్రమలో నిలదొక్కుకున్నారు.ఇదే వరుసలో తాజాగా మరో నట వారసుడు వెండితెరకు పరిచయం కాబోతున్నాడు.

TeluguStop.com - కనకాల ఫ్యామిలీ నుంచి హీరో వచేస్తున్నాడా..-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే…

తెలుగు బుల్లి తెరపై తిరుగులేని మహారాణిగా పేరు తెచ్చుకున్న వ్యక్తి యాంకర్ సుమ.టాలీవుడ్ నటుడు రాజీవ్ కనకాల భార్యగా ఈవిడ గుర్తింపు తెచ్చుకున్న సంగతి కూడా తెలిసిందే.వీరిద్దరి వారసుడే రోషన్ కనకాల.ప్రస్తుతం రోషన్ ను వెండితెరకు పరిచయం చేయాలని పెద్ద ఎత్తున ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి.కొత్త దర్శకుడు విజయ్ దర్శకత్వంలో ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఓ సినిమాను రూపొందించబోతున్నట్లు సమాచారం.ఇందుకు సంబంధించి నిర్మాణ కార్యక్రమాలలో యాంకర్ సుమ కూడా ప్రొడ్యూసర్ గా వ్యవహరించబోతున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే ఈ సినిమాను ఓ నూతన నిర్మాణ సంస్థతో కలిసి తెరకెక్కించబోతున్నారు.

ఇక కనకాల ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

వారి ఫ్యామిలీ నుంచి రాజీవ్ కనకాల తండ్రి గారు దేవదాస్ కనకాల కూడా ఓ నటుడు అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ మెంటర్ గా పనిచేశారు.అయితే కొన్ని కారణాల వల్ల గత కొంత కాలంగా యాంకర్ సుమ, భర్త రాజీవ్ కనకాల లు కాస్త దూరంగా ఉంటూ వచ్చారు.

అయితే ఇటీవలే మళ్లీ వీరిద్దరూ ఒకటైన సంగతి కూడా తెలిసిందే.వీళ్లిద్దరు కలిసిన తర్వాత వారి పిల్లల పై దృష్టి సారించినట్లు కనబడుతుంది.ఇందుకు సంబంధించి కొడుకు రోషన్ కనకాల ను హీరోగా పరిచయం చేయాలని తల్లిదండ్రులు నిర్ణయించుకున్నారు.ఇందుకు సంబంధించి ప్రకటన అతి త్వరలోనే రాబోతున్నట్లు సిని వర్గాల న్యూస్.

#Rajiv Kanakala #Anchor Suma #Roshan Kanakala

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Suma Kanakala Son Roshan Hero Tollywood Related Telugu News,Photos/Pics,Images..