తొలిసారి ఆ పని చేసి షాకిచ్చిన సుమ.. ఏమైందంటే..?

రెండు తెలుగు రాష్ట్రాల బుల్లితెర ప్రేక్షకులకు సుమ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఎంతమంది యాంకర్లు బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చినా సుమకు ఆ యాంకర్లు పెద్దగా పోటీని ఇవ్వలేకపోతున్నారు.

 Suma Kanakala Singing Anchor Ravi Fell Down In Big Celebrity Challenge Show-TeluguStop.com

ప్రస్తుతం సుమ రవితో కలిసి బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ అనే షో చేస్తుండగా ఈ షోకు సుమ యాంకరింగ్ వల్ల పరవాలేదనిపించే స్థాయిలో టీఆర్పీ రేటింగ్ లు వస్తున్నాయి.

బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఎపిసోడ్ 16కు ప్రముఖ సింగర్లు వచ్చారు.

 Suma Kanakala Singing Anchor Ravi Fell Down In Big Celebrity Challenge Show-తొలిసారి ఆ పని చేసి షాకిచ్చిన సుమ.. ఏమైందంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సుమ పాటలు పాడటం గురించి చెబుతూ పాడటం అంత తేలిక కాదని సాధన కావాలని చెబుతారు.ఈ షోకు సరిగమప సింగర్లు రాగా ఆ సింగర్లు చివర్లో గమకాలను పాడగా సుమ కూడా సింగర్లతో గొంతు కలపడంతో పాటు గమకాలను పాడారు.

సుమ ఏ మాత్రం తడబడకుండా గమకాలను పాడటంతో షోలో ఉన్నవాళ్లు సైతం అవాక్కయ్యారు.

ఆ తరువాత యాంకర్ రవి సుమ టాలెంట్ చూసి అవాక్కవడంతో పాటు సుమ కాళ్లపై పడి నమస్కారం చేశారు.

ప్రతిభ పుష్కలంగా ఉన్న సుమ తనలో మంచి సింగర్ కూడా ఉన్నారని ప్రూవ్ చేసుకున్నారు.సుమ షోలకు యాంకరింగ్ చేస్తున్నందుకు రెమ్యునరేషన్ కూడా బాగానే తీసుకుంటున్నారని తెలుస్తోంది.

సుమ ఒక ఎపిసోడ్ కు 2 లక్షలకు అటూఇటుగా పారితోషికం తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది.

Telugu Big Celebrity Challenge Show, Cash Show, Ravi Fell Down, Suma Kanakala Singing-Movie

ప్రీరిలీజ్ ఈవెంట్లకు సైతం దర్శకనిర్మాతలు ఎక్కువగా యాంకరింగ్ చేసే అవకాశాన్ని సుమకే ఇస్తుంటారు.గలగలా మాట్లాడే యాంకర్ సుమకు సంవత్సరాలు గడుస్తున్నా ప్రేక్షకుల్లో ఏ మాత్రం క్రేజ్ తగ్గకపోవడం గమనార్హం.మరోవైపు సుమకు కొత్త షోలకు యాంకరింగ్ ఆఫర్లు వస్తున్నాయని తెలుస్తోంది.

సుమ ఎక్కువగా ఈటీవీలో ప్రసారమయ్యే షోలకు యాంకర్ గా వ్యవహరిస్తున్నారు.ప్రస్తుతం సుమ బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ తో పాటు స్టార్ట్ మ్యూజిక్, క్యాష్ షోలకు యాంకర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

#Cash Show #BigCelebrity #SumaKanakala #Ravi Fell Down

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు