లవ్ స్టోరీలో ఆ పాత్ర చేసినందుకు నువ్వు ఎంత ఫీల్ అయ్యావో నాకు తెలుసు రాజీవ్: యాంకర్ సుమ

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడు రాజీవ్ కనకాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎన్నో సినిమాలలో కీలకమైన పాత్రలో నటించి ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కనకాలకు ఈ మధ్యకాలంలో సరైన పాత్రలు దక్కలేదనే చెప్పాలి.

 Anchor Suma About Rajeev Kanakala Performance In Love Story Movie,  Suma Kanakal-TeluguStop.com

తాజాగా రాజీవ్ కనకాల శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ స్టోరీ చిత్రంలో ఓ కీలకమైన పాత్రలో నటించారు.ఈ క్రమంలోనే ఆయన సతీమణి సుమ కనకాల లవ్ స్టోరీ చిత్రం చూసిన తర్వాత ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

తన నటనతో మనల్ని వారిలోకి లీనం చేసుకునే నటులు కొంత మంది ఉంటారు.అలాంటి వారిలో నా హస్బెండ్ ఒకరని, అద్భుతమైన పాత్రలో నటించినందుకు కంగ్రాట్స్.ఈ పాత్రలో నటించడం కోసం నువ్వు ఎంత ఫీల్ అయి ఉంటావో నాకు తెలుసు.కానీ ఇలాంటి సున్నితమైన పాత్రలో నటించి దానిని మరింత సున్నితంగా ప్రేక్షకులకు చూపించారని ఈ సందర్భంగా తన భర్తకు శేఖర్ కమ్ములకు కంగ్రాట్స్ తెలియజేశారు.

ఈ క్రమంలోనే హీరో నాగచైతన్యకి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు.

ఇక సాయి పల్లవి గురించి మాట్లాడుతూ తన డాన్స్ ఎంతో అద్భుతం అని తన డాన్స్ చూసి తనకు కళ్ళు నొప్పి పడుతున్నాయని కళ్ళు ఆర్పడం కూడా చేత కాలేదంటూ తనదైన శైలిలో మాట్లాడుతూ లవ్ స్టోరీ చిత్ర బృందానికి ఈమె తన శుభాకాంక్షలను తెలియజేశారు.ఇలా సుమ లవ్ స్టోరీ చిత్రం గురించి చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.చాలా రోజుల తర్వాత ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని పంచుతూ ఫీల్ గుడ్ చిత్రంగా లవ్ స్టోరీ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి కలెక్షన్లను రాబట్టిందని చెప్పవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube