సుమ కంటే నేనే ఎక్కువ సంపాదిస్తా: రాజీవ్ కనకాల

బుల్లితెర‌లో త‌న‌కంటూ ఒక ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న యాంక‌ర్ సుమ క‌న‌కాల‌.త‌న మాట‌ల‌తో అంద‌రిని న‌వ్వించ‌డం ఆమెలోని ప్ర‌త్యేక‌త‌.

 Anchor Suma Husband Rajeev Kanakala About His Income, Suma Remuneration, Rajeev-TeluguStop.com

టైమింగ్ లో గ్యాప్ లేకుండా పంచ్ లు పేల్చాలంటే సుమ త‌రువాతే మ‌రెవ‌రైనా.అందుకే ఆమె యాంక‌రింగ్ కోసం కొన్ని సినిమాల ఈవింట్ల‌ను సైతం పోస్ట్ ఫోన్ చేసుకుంటుంటారు.

అయితే సుమ ప్రోగ్రాముల‌కు ఉన్న డిమాండ్ లాగే త‌న సంపాద‌న కూడా ఎక్కువే అని చాలామంది అంటుంటారు.

అయితే సుమ క‌న‌కాల భ‌ర్త రాజీవ్ క‌న‌కాల ఎప్పుడు ఏ ఇంట‌ర్వ్యూకి వెళ్లినా.

చివ‌రి ప్ర‌శ్న‌గా మీ భార్య సుమ‌కంటే మీ సంపాద‌న త‌క్కువ క‌దా.? దానిపై మీ ఫిలింగ్ చెప్పండి అంటూ అడుగుతారు.అప్పుడు ఆయ‌న కోపంగా అవును ఇప్పుడేంటి అంటూ స‌మాధానం ఇస్తుంటారు.కానీ ఈ మ‌ధ్య ఒక ఇంట‌ర్వ్యూలో ఆస‌క్తిక‌ర స‌మాధానం చెప్పి అంద‌రిని ఆశ్చ‌ర్యానికి గురి చేశాడు.

Telugu Anchor Suma, Rajeev Kanakala, Rajeevkanakala, Rrr, Suma, Tollywood-Movie

ఆ ఇంట‌ర్వ్యూలో యాంక‌ర్ సుమ సంపాద‌న మీ సంపాద‌న కంటే ఎక్కువ‌గా అన‌గానే.రాజీవ్ క‌న‌కాల అవును అంటూ సమాధానం ఇచ్చాడు.అయితే ఈ విషయంపై మీరు ఏం అంటారు అని ప్రశ్నించగా.అందులో ఏముంది తను ఎక్కువ సంపాదించింది నేను తక్కువ సంపాదించ అంటూ టక్కున సమాధానం ఇచ్చిన రాజీవ్ కనకాల నేను రియల్ ఎస్టేట్ చేసి ఎక్కువే సంపాదించ అంటూ యాంకర్ కు అదిరిపోయే సమాధానం ఇచ్చాడు రాజీవ్.

ఇంకా అది విన్న యాంక‌ర్ ఒక్క‌సారిగా షాక్ కు గుర‌య్యారు.సుమ కంటే త‌న సంపాద‌న ఏ ర‌కంగా ఎక్కువ‌నో తెలిపిన విధానం అంద‌రిని ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది.

Telugu Anchor Suma, Rajeev Kanakala, Rajeevkanakala, Rrr, Suma, Tollywood-Movie

సుమ ఏ షో చేసినా దానికి మంచి పేరు వ‌స్తుంది.దాంతో ఆమె ల‌క్ష‌ల్లో తీసుకుంటుంద‌ని టాక్.త‌ను ఎంత అడిగిన ఇవ్వ‌డానికి షో నిర్వ‌హ‌కులు సిద్ధంగా ఉంటారు అంటే న‌మ్మ‌గ‌ల‌రా.? అలాంటి ఆమె కంటే త‌న సంపాద‌న ఎక్కువ‌ని రాజీవ్ క‌న‌కాల చెప్పారు.మొద‌ట్లో త‌ను సంపాదించి ఆస్తులు కూడ‌బెట్టాన‌ని తెలిపాడు.వాటి విలువ‌తో చూసుకుంటే సుమ సంపాద‌న చాల త‌క్కువ‌ని రాజీవ్ క‌న‌కాల వివ‌ర‌ణ ఇవ్వ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్యానికి గురి చేసింది.

అయితే రాజీవ్ క‌న‌కాల జూనియ‌ర్ ఎన్టీఆర్ తో చాలా క్లోజ్ గా ఉంటార‌ని అంద‌రికి తెలిసిందే.అలాగే ఆయ‌న చాలా సినిమాల్లో న‌టించిన సంగ‌తి తెలిసిందే.

అలాగే డైరెక్ట‌ర్ రాజ‌మౌళి కి కూడా చాలా క్లోజ్ అని తెలుస్తోంది.అయితే ఈ డైన‌మిక్ డైరెక్ట‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమాలో రాజీవ్ క‌న‌కాల మంచి పాత్ర‌లో న‌టిస్తున్నార‌ని స‌మాచారం.

అయితే ఏ పాత్ర‌లో న‌టిస్తున్నార‌నేది కొద్ది రోజులు ఆగితే తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube