‘ఆహా’ లోనూ అలరించిన సుమ

తెలుగు బుల్లి తెరపై తనదైన ముద్రను వేసిన యాంకర్‌ సుమ ఇప్పుడు ఓటీటీపై కూడా సందడి చేసేందుకు రెడీ అయ్యింది.వెండి తెరపై హీరోయిన్‌ గా నటించి బుల్లి తెరపై సుదీర్ఘ కాలంగా అరిస్తున్న సుమ ట్రెండ్‌ కు అనుగుణంగా ఓటీటీలో ఎంట్రీ ఇచ్చింది.

 Suma All Is Well Show Review, Suma, Aha, Ott, All Is Well, Telugu Anchor-TeluguStop.com

కొన్ని రోజుల క్రితం సుమ ఓటీటీ ఎంట్రీకి సంబంధించిన ప్రోమో వచ్చింది.అనుకున్నట్లుగానే సుమ ఓటీటీలో కూడా దుమ్ము రేపుతోంది.

ఆల్‌ ఈజ్‌ వెల్‌ అనే షోతో సుమ సందడి చేస్తోంది.ఎంట్రీ ఇవ్వడంతోనే సుమ అక్కడ ఇక్కడ నువ్వేనా అనుకుంటున్నారా అవును అక్కడ ఇక్కడ ఎక్కడైనా నేనే ఉంటాను అంటూ సరదాగా తనపై తానే కామెంట్స్‌ చేసింది.

బుల్లి తెరపై తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్న సుమ అదే ఇమేజ్‌ను ఇక్కడ కంటిన్యూ చేస్తూ కంటిన్యూ అవ్వాలని నిర్ణయించుకుంది.ఆల్‌ఈజ్‌ వెల్‌లో ప్రతి వారం ఒక సెలబ్రెటీతో మాట్లాడటంతో పాటు కొన్ని ఇంట్రెస్టింగ్‌ వైరల్‌ వీడియోస్‌ను ప్రసారం చేయబోతుంది.

ఆల్‌ఈజ్‌ వెల్‌ షోకు గాను ఈమె భారీ పారితోషికంను తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. సుమ ఉంటే లక్‌ అలా కలిసి వస్తుందని అంటారు.అందుకే ఆహా కేవలం లక్‌ కోసమే ఆ షోను ఆమెతో చేయిస్తుందేమో అంటూ కొందరు గుసగుసలాడుకుంటున్నారు.అనుకున్నట్లుగానే సుమ కార్యక్రమం వల్ల ఆహా ఒక్కసారిగా టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అయ్యింది.

ముందు ముందు కూడా సుమ నుండి ఓటీటీ షోలు వస్తాయని ఫ్యాన్స్‌ మరియు ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.మరి ఆహా వారు ఆమెను ఆల్‌ ఈజ్‌ వెల్‌ తో మాత్రమే ఆపేస్తారా లేదంటే ముందు ముందు మరిన్ని షోలు చేస్తారా అనేది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube