మగాళ్లు మృగాళ్లు.. అస్సలు నమ్మొద్దు అంటోన్న సుకుమార్  

Sukumar Urges Women Not To Believe In Men-murder,priyankareddy,rape And Murder,sukumar,telangana News

ఇటీవల జరిగిన దిషా(వెటర్నెరీ డాక్టర్) హత్యాచారాన్ని యావత్ భారతదేశం ఖండిస్తోంది.ఓ మహిళపై అత్యాచారం చేసి ఆమెను అతి దారుణంగా హత్య చేసిన దుండగులను పోలీసులు పట్టుకున్నా వారికి కఠిన శిక్ష పడేలా చట్టాలను కఠినం చేయాలంటూ అన్ని వర్గాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Sukumar Urges Women Not To Believe In Men-murder,priyankareddy,rape And Murder,sukumar,telangana News Telugu Viral News Sukumar Urges Women Not To Believe In Men-murder Priyankareddy Rape And Murder S-Sukumar Urges Women Not To Believe In Men-Murder Priyankareddy Rape And Murder Sukumar Telangana News

మహిళలపై జరుగుతున్న వరుస అఘాయిత్యాల పట్ల మహిళలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు, ప్రజలు కోరుతున్నారు.

కాగా దిషా హత్యపట్ల పలువురు సెలెబ్రిటీలు కూడా తమ స్పందనను తెలిపారు.

ఇప్పటికే మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి వారు మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను ఆపాలంటూ తమ గొంతుకను వినిపించారు.కాగా తాజాగా క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ కూడా మహిళలపట్ల జరుగుతున్న దాడులపై స్పందించాడు.

మగాళ్లను మహిళలు అస్సలు నమ్మొద్దని, మగాళ్లలా కనిపిస్తున్న మేము జంతువులమని సుకుమార్ తెలిపాడు.

సహాయం చేస్తామని మగాళ్లు చెబితే మహిళలు ఏమాత్రం నమ్మకండి అంటూ సుకుమార్ తెలిపాడు.

నేరస్థులు మగాళ్లలోనే ఉన్నారని, వారు ఎప్పుడు బయటకి వస్తారో తెలియదని సుకుమార్ అన్నాడు.మహిళలు మాత్రం జాగ్రత్తలు వహిస్తూ తమను తామను రక్షించుకోవాల్సిన అవసరం ఉందని సుకుమార్ కోరాడు.

మొత్తానికి దిషా హత్యాచారంపట్ల అటు ప్రజలతో పాటు ప్రముఖులు కూడా స్పందిస్తూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.కాగా దిషా హత్య కేసులో నిందితులను కోర్టు రిమాండ్‌ విధించిన విషయం తెలిసిందే.

తాజా వార్తలు