చివరకి సుకుమార్ కూడా అదే బాటలో!

టాలీవుడ్‌లో ప్రస్తుతం డిజిటల్ కంటెంట్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది.మారుతున్న సమయానికి తగ్గట్లుగా ప్రేక్షకుల అభిరుచి మారుతుండటంతో థియేటర్లకు వెళ్లి సినిమా చూసే తీరిక లేని వారు డిజిటల్ ప్లాట్‌ఫాంలలో సినిమాలు చూసేందుకు ఎక్కువ ఇష్టపడుతున్నారు.

 Sukumar To Enter Digital World With Web Series, Sukumar, Web Series, Pushpa, Tol-TeluguStop.com

ఇక కరోనా వైరస్ కారణంగా ఈ డిజిటల్ ప్లాట్‌ఫాంలకు మరింత ప్రేక్షకాదరణ లభించడంతో, ఇప్పుడు చిన్నాచితకా స్టార్స్ దగ్గర్నుండీ పెద్ద స్టార్స్ వరకు డిజిటల్ కంటెంట్‌కు మొగ్గు చూపుతున్నారు.

అయితే కేవలం సినిమాలే కాకుండా వెబ్ సిరీస్‌లకు కూడా అదిరిపోయే డిమాండ్ ఉండటంతో, టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు ఇప్పుడు వెబ్ సిరీస్‌ల బాట పడుతున్నారు.

తాజాగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కూడా వెబ్ సిరీస్‌లవైపు అడుగులు వేస్తున్నాడట.ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాంలో ఓ వెబ్ సిరీస్‌ను అందించేందుకు సుకుమార్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

తొమ్మిది ప్రేమకథలను ఈ వెబ్ సిరీస్‌లో చూపించే ప్రయత్నం చేస్తున్నాడట సుకుమార్.

కాగా ఈ వెబ్ సిరీస్‌కు సుకుమార్ కథ అందిస్తున్నాడా లేక డైరెక్ట్ చేస్తున్నాడా అనే అంశం మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్‌గా మారింది.

ఏదేమైనా సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్ కూడా వెబ్ ప్రపంచంలోకి అడుగు పెడుతుండటంతో ఈ తరహా కంటెంట్‌లకు ఎలాంటి డిమాండ్ ఉందో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు.కాగా ప్రస్తుతం ఆయన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో కలిసి పుష్ప అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

ఈ సినిమాను స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిస్తుండగా, ఇందులో కన్నడ బ్యూటీ రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube