మహేష్‌ ను ఇంకాస్త టైం అడిగిన సుకుమార్‌.. రంగస్థలం కంటే గట్టిగా కొట్టాలని..!   Sukumar Wants To Take Time For Mahesh Babu Movie     2018-12-03   09:28:32  IST  Ramesh P

రామ్‌ చరణ్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ సక్సెస్‌ను కానుకగా ఇచ్చిన దర్శకుడు సుకుమార్‌ ప్రస్తుతం మహేష్‌బాబుతో సినిమాను చేసేందుకు సిద్దం అవుతున్న విషయం తెల్సిందే. రంగస్థలం చిత్రం విడుదలైన కొన్ని రోజులకే మహేష్‌బాబు, సుకుమార్‌ల మూవీ పట్టాలెక్కబోతుంది అంటూ మైత్రి వారు అధికారికంగా క్లారిటీ ఇచ్చారు. ముందుగా అనుకున్న ప్రకారం డిసెంబర్‌లోనే సినిమాను పట్టాలెక్కించాల్సి ఉంది. కాని కథ ఆలస్యం అవుతున్న కారణంగా సినిమాను వాయిదా వేస్తూ వస్తున్నారు.

మొదట మహేష్‌ కోసం ఒక కథను దర్శకుడు సుకుమార్‌ సిద్దం చేశాడు. కాని ఆ కథ మహేష్‌ బాబుకు నచ్చలేదు. ఎందుకంటే రంగస్థలం మాదిరిగానే పీరియాడిక్‌ నేపథ్యంలోని కథ అది. ప్రస్తుతం వరుసగా వస్తున్న సినిమాలన్నీ కూడా పీరియాడిక్‌ నేపథ్యంలోనివే కావడంతో మహేష్‌బాబు మరేదైనా కథతో చేద్దామని సూచించడంతో దర్శకుడు సుకుమార్‌ కథను మార్చే పనిలో పడ్డాడు. ప్రస్తుతం సినిమా కథ చర్చలు జరుగుతున్నాయట. డిసెంబర్‌కు కథ ఫైనల్‌ చేయాలని సుకుమార్‌ అనుకున్నాడు. తాజాగా మహేష్‌ను కలిసిన సుకుమార్‌ కథ ఆలస్యం అవుతుందని, తప్పకుండా మంచి సినిమాను అందించేందుకు పవర్‌ ఫుల్‌ కథను రెడీ చేస్తానంటూ హామీ ఇచ్చాటడట.

Sukumar Wants To Take Time For Mahesh Babu Movie-Mahesh Movie With Next

సుకుమార్‌ కథ ఆలస్యం చేస్తునాన పర్వాలేదు మంచి కథను తీసుకురమ్మంటూ సూచించాడట. మహేష్‌బాబు ప్రస్తుతం మహర్షి చిత్రంతో బిజీగా ఉన్న మహేష్‌బాబు ఆ తర్వాత సుకుమార్‌ సినిమాను చేయబోతున్నాడు. సమ్మర్‌ నుండి మహేష్‌బాబు, సుకుమార్‌ల మూవీ పట్టాలెక్కే అవకాశం ఉందని సినీ వర్గాల వారు అంటున్నారు. సుకుమార్‌ చాలా గట్టి పట్టుదతో రంగస్థలం కంటే భారీ విజయాన్ని సొంతం చేసుకోవాలని ఉన్నాడు. మరి మహేష్‌బాబుకు రంగస్థలంను మించిన సక్సెస్‌ ఇచ్చేనా చూడాలి.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.