రౌడీ కోసం దేశాల మధ్య చిచ్చుపెడుతున్న సుకుమార్- Sukumar Vijay Devarakonda Movie Based On Indo Pakistan War

Sukumar Vijay Devarakonda Movie Based On Indo Pakistan War, Sukumar, Vijay Devarakonda, Liger, Pushpa, Tollywood News - Telugu Liger, Pushpa, Sukumar, Tollywood News, Vijay Devarakonda

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ లైగర్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ రీసెంట్‌గా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటేందుకు విజయ్ దేవరకొండ రెడీ అవుతున్నాడు.

 Sukumar Vijay Devarakonda Movie Based On Indo Pakistan War-TeluguStop.com

ఇక ఈ సినిమాను క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా చిత్ర యూనిట్ రూపొందిస్తున్నారు.కాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాపై అప్పుడే భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

ఇక ఈ సినిమా తరువాత విజయ్ దేవరకొండ తన నెక్ట్స్ మూవీని టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కించనున్నాడు.ఈ సినిమా కోసం సుకుమార్ ఎలాంటి కథను రెడీ చేస్తాడా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

 Sukumar Vijay Devarakonda Movie Based On Indo Pakistan War-రౌడీ కోసం దేశాల మధ్య చిచ్చుపెడుతున్న సుకుమార్-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాగా ఈ సినిమా కథ ఇండో-పాక్ నేపథ్యంలో సాగుతుందని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.ఇండో-పాక్ నేపథ్యంలో సాగే వార్ కథను సుకుమార్ తెరకెక్కించబోతున్నాడనే టాక్ సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఓ సైనికుడి పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.

ఏదేమైనా ఇంకా పట్టాలెక్కకుముందే ఈ సినిమా గురించి ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇక వీలైనంత త్వరగా ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు సుకుమార్ అండ్ టీమ్ రెడీ అవుతోంది.

కాగా ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో కలిసి ‘పుష్ప’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సుకుమార్, అది పూర్తయ్యాకే విజయ్ దేవరకొండతో కలిసి చేయనున్నాడు.మరి విజయ్ దేవరకొండ లైగర్ చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

#Pushpa #Sukumar #Liger

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు