ఉప్పెనలో కొట్టుకుపోయిన సుకుమార్.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్!  

Sukumar Vaishnav Tej - Telugu Krithi Shetty, Sukumar, Tollywood News, Uppena, Vaishnav Tej

మెగా ఫ్యామిలీ నుండి వస్తున్న కొత్త హీరో వైష్ణవ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఉప్పెన’ ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉంది.కానీ లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా వాయిదా పడిన సంగతి అందరికీ తెలిసిందే.

 Sukumar Vaishnav Tej

ఈ సినిమాకు సుకుమార్ కథ అందించడంతో ఈ మూవీ ఎలా ఉంటుందా అనే ఆతృత మెగా ఫ్యాన్స్‌తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా మొదలైంది.కాగా ఈ సినిమా పోస్టర్స్, టీజర్స్, సాంగ్స్ ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి.

ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కావడంతో ఈ సినిమా ఎలా ఉందో దర్శకుడు సుకుమార్ పరీక్షించాడు.ఇందులో భాగంగా ఈ సినిమాను ఎడిట్ చేసేందుకు ఆయన ఈ సినిమాను చూసినట్లు తెలుస్తోంది.

ఉప్పెనలో కొట్టుకుపోయిన సుకుమార్.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్-Gossips-Telugu Tollywood Photo Image

కాగా సినిమా ఔట్‌పుట్ చాలా బాగా వచ్చిందని సుకుమార్ తెలిపాడు.ఈ సినిమాను తన అసిస్టెంట్ బుచ్చిబాబు చాలా బాగా తెరకెక్కించాడని, చిత్ర నటీనటుల పర్ఫార్మెన్స్ సూపర్‌గా ఉందని ఆయన అన్నాడు.

ఇక ఈ సినిమా రన్‌టైమ్‌ను ఆయన 2 గంటల 30 నిమిషాలకు ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

మొత్తానికి మెగా ఫ్యామిలీ నుండి రాబోతున్న వైష్ణవ్ తేజ్ సరికొత్త చిత్రం సుకుమార్‌ను పూర్తిగా ఇంప్రెస్ చేసినట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోండగా టాలీవుడ్ రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.ఇప్పటికే ఈ సినిమా పాటలు ప్రేక్షకులను అలరించడంలో పూర్తిగా సక్సెస్ అయ్యాయి.

మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా, ఈ సినిమాకు ఎలాంటి రిజల్ట్ వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test