పుష్పలో ఐటెం సాంగ్ కోసం కాజల్ ని రంగంలోకి దించుతున్న లెక్కల మాస్టర్

టాలీవుడ్ లో లెక్కల మాస్టర్ అంటే సుకుమార్ అని ఇట్టే ఎవరైనా చెప్పేస్తారు.సుకుమార్ సినిమా అంటే ఐటెమ్ సాంగ్ తప్పనిసరి.

 Sukumar Tries Kajal Aggarwal For Pushpa Movie Item Song-TeluguStop.com

అది కూడా యూత్ కి కిక్ ఎక్కించే స్థాయిలో అతని సినిమాలలో ఐటెమ్ సాంగ్స్ ఉంటాయి.అలాగే ట్రెండ్ సెట్ చేసే విధంగా అతని సినిమా ఐటెమ్ గీతాలు ఇప్పటి వరకు ఉన్నాయి.

ఈ గతంలో ఐటెమ్ సాంగ్స్ కి సపరేట్ గా కొంత మంది బ్యూటీస్ ఉండేవారు.వారిని కేవలం ఆ పాటల కోసం మాత్రమే తీసుకునే వారు.

 Sukumar Tries Kajal Aggarwal For Pushpa Movie Item Song-పుష్పలో ఐటెం సాంగ్ కోసం కాజల్ ని రంగంలోకి దించుతున్న లెక్కల మాస్టర్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

గతంలో జయమాలిని, జ్యోతిలక్ష్మి, సిల్క్ స్మిత లాంటి భామలు ఐటెమ్ హీరోయిన్స్ గా ఫేమస్ అయ్యారు.ఆ తరువాత ముమైత్ ఖాన్ కొంత కాలం టాలీవుడ్ లో ఐటెం బ్యూటీగా తన హవా కొనసాగించింది.

అయితే హీరోయిన్స్ ఎప్పుడైతే ఐటెమ్ సాంగ్స్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం మొదలు పెట్టారో అప్పటి నుంచి ప్రత్యేక గీతాల కోసం ఉన్నవారికి డిమాండ్ తగ్గిపోయింది.

సౌత్ లో చార్మి, తమన్నా, కాజల్, పూజా హెగ్డే లాంటి బ్యూటీస్ అందరూ ఐటెం సాంగ్స్ లో మెరిసిన వారే.

ఒక సాంగ్ కోసం వీరికి 30 లక్షల నుంచి కోటి రూపాయిల వరకు రేంజ్ బట్టి పే చేస్తారు.ఒకే ఒక్క సాంగ్ తో అంత పెద్ద మొత్తంలో వచ్చిన మనీని ఎందుకు వదులుకోవడం అని హీరోయిన్స్ ఐటెం భామల అవతారం ఎత్తారు.

ఇదిలా ఉంటే సుకుమార్ రంగస్థలం సినిమాలో ఐటెం సాంగ్ కోసం పూజా హెగ్డేని రంగంలోకి దించాడు.జిగేలు రాణి సాంగ్ ఎంత ఊపు ఊపిందో అందరికి తెలిసిందే.

ఇప్పుడు జిగేలు రాణిని మించి పుష్పలో ఐటెం సాంగ్ ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు.దీనికోసం బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలాని ముందుగా అనుకున్నా ప్రస్తుతం దానికోసం కాజల్ అగర్వాల్ ని రంగంలోకి దించుతున్నట్లు తెలుస్తుంది.

ఇప్పటికే ఆమెని సుకుమార్ టీమ్ సంప్రదించిందని సమాచారం.గతంలో సుకుమార్, అల్లు అర్జున కాంబోలో ఆర్య2 లో కాజల్ అగర్వాల్ నటించింది.

దాంతో పటు జనతా గ్యారేజ్ సినిమాలో కాజల్ ఇప్పటికే ఐటెం సాంగ్ చేసింది.ఈ నేపధ్యంలోనే పుష్ప ఐటెం సాంగ్ కోసం ఆమెని సంప్రదించినట్లు సమాచారం.

#PushpaMovie #Arya 2 #Allu Arjun #Urvashi Rautela #PushpaMovie

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు