పుష్పలో ఆ పాయింట్‌ను వదలని సుకుమార్  

Sukumar Touching That Point In Pushpa, Sukumar, Pushpa, Allu Arjun, Tollywood News - Telugu Allu Arjun, Pushpa, Sukumar, Tollywood News

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తు్న్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టుకున్న సంగతి తెలిసిందే.టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్‌లో ఈ సినిమా వస్తుండటంతో అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి.

TeluguStop.com - Sukumar Touching That Point In Pushpa

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

ఇక ఈ సినిమాను పూర్తిగా ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌లో సుక్కు తెరకెక్కిస్తుండటంతో బన్నీ ఈ సినిమాలో ఎలా కనిపిస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.కాగా ఈ సినిమాలో ఆయన ఓ లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తాడని తెలుస్తోంది.

TeluguStop.com - పుష్పలో ఆ పాయింట్‌ను వదలని సుకుమార్-Gossips-Telugu Tollywood Photo Image

అయితే ఈ సినిమాలో సుకుమార్ ఓ సరికొత్త పాయింట్‌ను కూడా టచ్ చేయనున్నట్లు తెలుస్తోంది.ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో స్మగ్లర్లు, పోలీసులతో పాటు కూలీల జీవితాలను కూడా మనకు కళ్లకు కట్టినట్లు చూపించేందుకు సుకుమార్ రెడీ అవుతున్నారు.

పొట్టకూటి కోసం కూలీలుగా మారిన వారు ఈ స్మగ్లింగ్ ఉచ్చులో ఎలా ఇరుక్కుంటారు అనే అంశాన్ని మనకు సుకుమార్ చూపించనున్నాడట.ఈ పాయింట్‌పైనే సినిమా కథ నడుస్తుందని చిత్ర వర్గాలు అంటున్నాయి.

***

మొత్తానికి సుకుమార్ తాను తీస్తున్న సినిమాలో కథకు సంబంధించి ఎలాంటి పాయింట్‌ను వదిలే ప్రసక్తే లేదని ఈ సినిమాతో మరోసారి నిరూపించనున్నాడట.ఇక ఈ సినిమాలో బన్నీ సరసన కన్నడ బ్యూటీ రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది.

ఈ సినిమాలో విలన్ పాత్రలో తొలుత తమిళ నటుడు విజయ్ సేతుపతిని తీసుకోగా, కొన్ని కారణాల వల్ల ఆయన ఈ సినిమా నుండి వాకౌట్ చేశాడు.ఈ సినిమా షూటింగ్‌ను వీలైనంత త్వరగా తిరిగి ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

#Pushpa #Allu Arjun #Sukumar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Sukumar Touching That Point In Pushpa Related Telugu News,Photos/Pics,Images..