తన శిష్యుడిపై ఉప్పెనంత ప్రేమ కురిపించిన సుకుమార్..!

మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా, అతనికి జోడీగా హీరోయిన్ కృతి శెట్టి పరిచయం అయిన చిత్రం ఉప్పెన.ఈ సినిమాకు సంబంధించి టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దగ్గర శిష్యరికం చేసిన బుచ్చిబాబు మొదటిసారి దర్శకత్వాన్ని వహించాడు.

 Sukumar Shares Emotional Post For His Student Bucchibabu, Tollywood, Sukumar, Bu-TeluguStop.com

ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 12న ఉప్పెన సినిమా రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ తో వసూళ్ల సునామీ సృష్టిస్తోంది.టాలీవుడ్ అంచనా ప్రకారం ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 50 కోట్లకు పైగా ఉప్పెన సినిమా వసూళ్లను రాబట్టిందని.

టాలీవుడ్ చరిత్రలో అత్యధిక వసూళ్లు రాబట్టిన డెబ్యూ సినిమా నిలుస్తుందని తెలుపుతున్నారు.ఈ సినిమాకి ఇంత హైప్ రావడం గల మరో కారణం ఈ సినిమాలో విలన్ పాత్రలో తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి తనదైన శైలిలో నటించి అందరిని మెప్పించాడు.

ఇక సుకుమార్ తన ప్రియ శిష్యుడి తొలి సినిమా అనుకున్నదాని కంటే సూపర్ సూపర్ హిట్ అవ్వడంతో సుకుమార్ ఆనందంతో తెగ ఎంజాయ్ చేస్తున్నారు.తన పేరును తన శిష్యుడు నిలబెట్టినందుకు తనకు ఎంతో గర్వంగా ఉన్నట్టు ఒక కవిత రూపంలో ఎమోషనల్ పోస్ట్ చేశాడు.ఇందులో భాగంగానే తన శిష్యుడు బుచ్చిబాబు ను ఉద్దేశించి.‘ నువ్వు నన్ను గురువు చేసేసరికి నాకు నేను శిష్యుడు అయిపోయాను.ఇంత గొప్ప సినిమా తీయడానికి నువ్వు నా దగ్గర ఏం నేర్చుకున్నావా.? నాకు నేను శిష్యుడ్ని అయిపోతే తప్ప అదేంటో తెలుసుకోలేను.నాలోకి నన్ను అన్వేషించుకునేలా చేసిన సా‘నా’బుచ్చిబాబు ను ఉప్పెనంత ప్రేమతో అభినందిస్తూ.ఇట్లు సుకుమార్‌ ఇంకో శిష్యుడు‘ అంటూ బుచ్చిబాబు తన భుజాలపై ఉన్న ఫోటోని బ్యాక్ గ్రౌండ్ లో ఉపయోగిస్తూ ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా పోస్టును షేర్ చేశాడు.

ప్రస్తుతం పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.ఎంతైనా ఒక శిష్యుడు తన కంటే మంచి మార్కులు సాధించినప్పుడు అందరికంటే ఎక్కువ ఆనందపడేది మాత్రం తన తల్లితండ్రుల తర్వాత తన గురువు మాత్రమే.ఈ విషయం నేడు సుకుమార్ బుచ్చిబాబు లను చూస్తే ఇట్టే అర్థమవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube