సుకుమార్ క్రియేటివిటీ కూడా కాపీయేనా..?  

Sukumar Story 18 Pages Is A Copy, Sukumar, Pushpa, Allu Arjun, Nikhil, 18 Pages - Telugu 18 Pages, Allu Arjun, Nikhil, Pushpa, Sukumar

టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్‌గా సుకుమార్ ఎలాంటి ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడో అందరికీ తెలిసిందే.ఈ డైరెక్టర తెరకెక్కించే ప్రతి సినిమా చాలా క్రియేటివ్‌గా ఉంటుందనే నమ్మకం ప్రేక్షకుల్లో పెద్ద ఎత్తున ఉంది.

 Sukumar Story 18 Pages Is A Copy 18

దీంతో ఆయన తెరకెక్కించే ప్రతి సినిమాను ప్రేక్షకులు తప్పకుండా చూడాలని కోరుకుంటారు.కాగా ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా పుష్ప అనే సినిమాను తెరకెక్కిస్తున్న ఈ డైరెక్టర్, ఇతర చిత్రాలకు రచయితగా కూడా వ్యవహరిస్తున్నాడు.

యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కార్తికేయ-2’ని ఇప్పటికే అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు చిత్ర యూనిట్.కాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను త్వరలోనే ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

సుకుమార్ క్రియేటివిటీ కూడా కాపీయేనా..-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

అయితే ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ మూవీని గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో చేయడానికి రెడీ అయ్యాడు ఈ హీరో.ఈ సినిమాకు సుకుమార్ కథను అందిస్తుండగా ఇది వేరొక సినిమా నుండి స్పూర్తి పొందిన కథ అని తెలుస్తోంది.

గతంలో సుకుమార్ కథ అందించిన కుమారి 21ఎఫ్ ఓ గ్రీక్ సినిమా నుండి స్పూర్తి పొందిందని చిత్ర యూనిట్ తెలిపింది.

దీంతో ఇప్పుడు మరోసారి సుకుమార్ ‘18 పేజిస్’ చిత్రానికి కూడా ఇలాంటి కథే ఇచ్చి ఉంటాడని చిత్ర వర్గాలు అంటున్నాయి.

మరి ఈ సినిమా ఏ సినిమా నుండి కాపీ కొట్టారో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.కాగా ఈ సినిమాను పల్నాటి సూర్య ప్రతాప్ డైరెక్ట్ చేస్తున్నాడు.

ఇక ప్రస్తుతం పుష్ప అనే సినిమాను తెరకెక్కిస్తున్న సుకుమార్ ఈ సినిమాతో మరోసారి అదిరిపోయే రికార్డును క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.

#Allu Arjun #Nikhil #Pushpa #18 Pages #Sukumar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Sukumar Story 18 Pages Is A Copy 18 Related Telugu News,Photos/Pics,Images..