ఆ మాటలకే నేను పడిపోయా.. సుకుమార్ భార్య కామెంట్స్ వైరల్..?

స్టార్ డైరెక్టర్ సుకుమార్ తన సినిమాల్లో మాటలు ఎంత అద్భుతంగా రాస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఆర్య, ఆర్య2 సినిమాలలో సుకుమార్ రాసిన కవితలు ఆ సినిమాలకు హైలెట్ అయ్యాయి.

 Sukumar Special Poetry On Thabitha For Wedding Anniversary-TeluguStop.com

ఈరోజు సుకుమార్ తన భార్యపై ప్రేమను కురిపించారు.పెళ్లిరోజు సందర్భంగా సుకుమార్ రాసిన కవిత నెట్టింట వైరల్ అవుతుండటం గమనార్హం.

లాజిక్ తో మ్యాజిక్ చేసే సుకుమార్ భార్య ఫిదా అయ్యేలా కవిత రాశారు.

 Sukumar Special Poetry On Thabitha For Wedding Anniversary-ఆ మాటలకే నేను పడిపోయా.. సుకుమార్ భార్య కామెంట్స్ వైరల్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సుకుమార్ భార్య తబిత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారనే సంగతి తెలిసిందే.

సుకుమార్ సినిమా సెట్స్ లో తబిత కనిపిస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఉంటారు.తన పర్సనల్ లైఫ్ తో పాటు పిల్లలకు సంబంధించిన విషయాలను కూడా తబిత సోషల్ మీడియా ద్వారా అభిమానులకు చెబుతూ ఉంటారు.

సుకుమార్ తబిత వివాహం జరిగి 12 సంవత్సరాలు కావడంతో భార్యకు సుకుమార్ అందమైన కవిత్వాన్ని బహుమతిగా ఇచ్చారు.

సుకుమార్ కవితలో నేను ఎప్పుడూ సగాన్నే.నువ్వు నా జీవితంలోకి రాకముందు పూరి కాని సగాన్ని.నువ్వు నా జీవితంలోకి వచ్చిన తరువాత పూర్తైన సగాన్ని.

నీ సగం కావడమే నేను పూర్తి కావడం కదా అని సుకుమార్ పేర్కొన్నారు.సుకుమార్ కవితకు నెటిజన్లు సైతం ఫిదా అవుతున్నారు.

సుకుమార్ రాసిన కవిత చాలా అద్భుతంగా ఉందని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.సుకుమార్ కవిత గురించి స్పందిస్తూ తబిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

సుకుమార్ ఈ విధంగా చెప్పే మాటలే తనను ఎంతో ఆకట్టుకుంటాయని అది సుకుమార్ కు ఉన్న సూపర్ పవర్ అని తబిత వెల్లడించారు.సుకుమార్ చెప్పే మాటలకే తాను పడిపోయానని ఐలవ్యూ అంటూ తబిత చెప్పుకొచ్చారు.తబిత సుకుమార్ కవితను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఆ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

#Goes Viral #Sukumar #Instagram Post #Social Media #SukumarPoetry

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు