అల్లు అర్జున్‌ అభిమానులకు సారీ చెప్పిన సుకుమార్‌.. కారణం ఇదే

అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప సినిమా షూటింగ్‌ సగానికి పైగా పూర్తి అయ్యింది.ఈ సినిమాలో అల్లు అర్జున్‌ లుక్‌ ఎలా ఉంటుందో ఇప్పటికే చిత్ర యూనిట్‌ సభ్యుల నుండి క్లారిటీ వచ్చింది.

 Sukumar Sorry To Allu Arjun Fans About Pushpa Movie Look-TeluguStop.com

ఆయన లుక్‌ ను షూటింగ్‌ ఆరంభంకు ముందే సుకుమార్‌ విడుదల చేశాడు.ఇటీవల కూడా బన్నీ లుక్‌ ను మళ్లీ విడుదల చేశారు.

ఇదే సమయంలో ఈ సినిమా నుండి టీజర్‌ ను విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.ఇక ఈ సినిమా ప్రెస్‌ మీట్‌ తాజాగా నిర్వహించారు.

 Sukumar Sorry To Allu Arjun Fans About Pushpa Movie Look-అల్లు అర్జున్‌ అభిమానులకు సారీ చెప్పిన సుకుమార్‌.. కారణం ఇదే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ సినిమా లో అల్లు అర్జున్‌ ను స్టైలిష్‌ గా చూపించడం లేదు అంటూ సుకుమార్‌ చెప్పేశాడు.అల్లు అర్జున్‌ అనగానే అంతా కూడా స్టైలిష్‌ లుక్‌ ను ఆశిస్తు ఉంటారు.

కాని ఈ సినిమాలో మాత్రం అలా కాదు.

సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందిన గత చిత్రాలను చూస్తే ఎన్నో సినిమాల్లో హీరోలు స్టైలిష్‌ లుక్‌ లో కనిపించారు.

కాని రంగస్థలం చిత్రంలో మాత్రం చరణ్‌ ను స్టైలిష్‌ గా చూపించకుండా కంట్రీ లుక్‌ లో చూపించారు.ఇప్పుడు అల్లు అర్జున్‌ మరీ మాస్ గా చూపించబోతున్నాడు.

చింపిరి జుట్టు గడ్డం మాసిన బట్టలతో అల్లు అర్జున్‌ ను అలా చూపించబోతున్నందుకు సారీ అంటూ సుకుమార్‌ వ్యాఖ్యలు చేశాడు.ఒక ఐకానిక్‌ లుక్‌ లో బన్నీ కనిపిస్తాడనే నమ్మకంను సుకుమార్‌ వ్యక్తం చేశాడు.

తప్పకుండా ఇదో వైవిధ్యభరిత సినిమాగా నిలుస్తుందని ఈ సందర్బంగా ఆయన నమ్మకంగా వ్యాఖ్యలు చేశాడు.ఈ సినిమాలో రష్మిక లుక్‌ కూడా చాలా మాసీగా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

రష్మిక లుక్‌ పై ఇప్పటి వరకు స్పష్టత రాలేదు.

#Bunny New Look #Sukumar #Pushpa #Allu Arjun

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు