రాజమౌళి సుకుమార్ అలా మిత్రులయ్యారట !

టాలీవుడ్ ఇండస్ట్రీలో టాలెంటెడ్ దర్శకులకు కొదవే లేదు.పాత దర్శకులు ఇప్పటికి తమ టాలెంట్ చూపించుకుటూనే ఉన్నారు.

 Sukumar Rajamouli Friendship-TeluguStop.com

అలాగే కొత్త దర్శకులు కూడా తమ టాలెంట్ తో యూత్ కు మరింత దగ్గర అవుతున్నారు.టాలీవుడ్ లో ఉన్న స్టార్ దర్శకుల లిస్టులో రాజమౌళి, సుకుమార్ తప్పకుండ ఉంటారు.

రాజమౌళి ఇప్పటి వరకు తన కెరీర్ లో ఒక్క ప్లాప్ కూడా లేకుండా సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్నాడు.

 Sukumar Rajamouli Friendship-రాజమౌళి సుకుమార్ అలా మిత్రులయ్యారట -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక బాహుబలి సినిమాతో తన టాలెంట్ తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

అంతేకాదు తెలుగు కీర్తిని ప్రపంచ నలుమూలల వ్యాపించేలా చేసాడు.ఈ సినిమా తర్వాత తెలుగు సినీ పరిష్ట్రమా మరింత గుర్తింపు తెచ్చుకుంది.

కేవలం బాహుబలి సినిమా కారణంగానే ఈ రోజు మన తెలుగు హీరోలు వరసపెట్టి పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు.

ఇక సుకుమార్ విషయానికి వస్తే రాజమౌళి అంత పేరు లేకపోయినా మోస్ట్ టాలెంటెడ్ దర్శకుడిగా పేరు అయితే తెచ్చుకున్నాడు.

తన క్రియేటివిటీతో తెలుగు సినిమాల్లో తన కంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు.ఆయన ఆర్య సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో వెలుగులోకి వచ్చారు.ఈ సినిమాతోనే అల్లు అర్జున్ స్టార్ హీరో అయ్యాడు.ఈ సినిమా తర్వాత సుకుమార్ టాలెంట్ ను చూసి రాజమౌళి కూడా అసూయ పడ్డారట.

Telugu Rajamouli, Sukumar, Sukumar Rajamouli Friendship, Telugu Industry, Tollywood-Movie

ఎందుకంటే అప్పటికి రాజమౌళి రెండు సినిమాలు మాత్రమే తీసాడు.ఎన్టీఆర్ తో స్టూడెంట్ నెంబర్ 1, సింహాద్రి సినిమాలు చేసాడు.ఆ టైం లోనే ఆర్య సినిమాతో సుకుమార్ ఒక్కసారిగా స్టార్ అవ్వడంతో రాజమౌళి తనకు పోటీగా వచ్చాడని అనుకున్నాడట.ఈ విషయాన్నీ రాజమౌళి స్వయంగా తన నోటితోనే అన్నారు.

అయితే ఈ సినిమా తర్వాత రాజమౌళి సుకుమార్ తో శత్రుత్వం పెంచుకోవాలి లేకపోతే స్నేహంగా ఉండాలా అని చాలా ఆలోచించాడట.శత్రువుగా భావిస్తే ఎప్పుడు కోపంతోనే ఉండాలి అదే స్నేహితుడిగా భావిస్తే ప్రశాంతంగా ఉండవచ్చని అందుకే సుకుమార్ తో కలిసి స్నేహితుడిగా ఉన్నాడట.

అప్పటి నుండి ఇప్పటి వరకు వీరిద్దరూ స్నేహితులుగానే ఉంటున్నారు.మొత్తానికి రాజమౌళి సుకుమార్ అలా స్నేహితులయ్యారన్నమాట.

#Sukumar #Rajamouli

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు