పుష్పకు తలనొప్పిగా మారిన బ్యాక్‌డ్రాప్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాతో మరోసారి బన్నీ సెన్సేషన్ క్రియేట్ చేయాలని చూస్తున్నాడు.

 Sukumar Trouble With Location For Pushpa, Sukumar, Pushpa, Allu Arjun, Rashmika-TeluguStop.com

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ముచ్చటగా మూడోసారి బన్నీ నటిస్తుండటంతో, ఈ సినిమాతో వారు హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని చిత్ర యూనిట్ భావిస్తోంది.ఇక ఈ సినిమాను పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా సుకుమార్ తీర్చిదిద్దుతున్నాడు.

ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌తో రానున్న ఈ సినిమాలో బన్నీ ఓ లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తున్నాడు.ఆయన పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్‌ను ఇప్పటికే రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.

కాగా లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే.అయితే ఇప్పుడు షూటింగ్‌లు మొదలవుతుండటంతో ‘పుష్ప’ చిత్ర షూటింగ్ కూడా మొదలుపెట్టాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

బన్నీ కూడా దీనికి ఓకే అనడంతో, ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

కానీ ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించే విషయంలో దర్శకుడు సుకుమార్‌కు పెద్ద తలనొప్పి వచ్చి పడింది.

ఈ సినిమా అడవి బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతుండటంతో ఇప్పుడు ఈ సినిమాను ఎక్కడ షూట్ చేయాలా అనే ఆలోచనలో పడ్డారట సుకుమార్.దీంతో ఈ సినిమా ఇప్పట్లో తిరిగి పట్టాలెక్కే ఛాన్స్ లేదని తెలుస్తోంది.

మొత్తానికి బన్నీ ‘పుష్ప’ చిత్రం ఎప్పుడు తెరకెక్కుతుందా అని అందరూ ఆసక్తిగా చూడాల్సిన పరిస్థితి నెలకొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube