మహేష్‌బాబు ఇంకా ఒప్పుకోలేదట!  

Sukumar Prepared News Story For Mahesh Babu-

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు ప్రస్తుతం తన 25వ చిత్రం ‘మహర్షి’ లో నటిస్తున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ఆ చిత్రంను వచ్చే వేసవికి ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడు. ఆ చిత్రం విడుదల కాకముందే సుకుమార్‌ దర్శకత్వంలో మహేష్‌బాబు ఒక చిత్రాన్ని చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఇప్పటికే ఆ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది..

మహేష్‌బాబు ఇంకా ఒప్పుకోలేదట!-Sukumar Prepared News Story For Mahesh Babu

రంగస్థలం వంటి బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ తర్వాత సుకుమార్‌ చేయబోతున్న సినిమా ఇద్దే అవ్వడంతో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా ఉండేలా సుకుమార్‌ స్క్రిప్ట్‌ను సిద్దం చేస్తున్నాడు.

మహేష్‌బాబు కోసం ఒక విభిన్నమైన స్క్రిప్ట్‌ను రెడీ చేసిన సుకుమార్‌ త్వరలో ఆ స్క్రిప్ట్‌తో సినిమాను మొదలు పెట్టాలని భావించాడు. అయితే అచ్చు అలాంటి నేపథ్యంలోనే ఇప్పుడు రెండు మూడు సినిమాలు తెరకెక్కుతున్నాయి.

అది కూడా స్టార్‌ హీరోల సినిమాలు అవ్వడంతో తప్పనిసరి పరిస్థితుల్లో, తప్పక ఆ స్క్రిప్ట్‌ను వదిలేయాల్సి వచ్చింది. ఆ స్క్రిప్ట్‌ను పక్కకు పెట్టడంతో ఇప్పుడు దర్శకుడు సుకుమార్‌ కొత్త కథను రాసుకునే పనిలో ఉన్నట్లుగా సమాచారం అందుతుంది..

తన సన్నిహిత రైటర్స్‌ తో కలిసి రెండు మూడు స్టోరీ లైన్‌ లను సిద్దం చేసినట్లుగా తెలుస్తోంది. అందులో ఒకటి మహేష్‌ ఒప్పుకుంటే దాన్ని స్క్రిప్ట్‌ పనులు మొదలు పెట్టబోతున్నాడు.

సుకుమార్‌ సినిమా అంటే విభిన్నమైన స్క్రీన్‌ప్లేతో సాగుతుంది. అందుకే మహేష్‌బాబు ఆయన దర్శకత్వంలో నటించిన 1 నేనొక్కడినే చిత్రం ఫ్లాప్‌ అయినా కూడా మరోసారి ఆయనతో నటించేందుకు సిద్దం అయ్యాడు..

ఈసారి మహేష్‌బాబుకు బ్లాక్‌ బస్టర్‌ ఇవ్వాలనే తపనతో కథను సిద్దం చేస్తున్నాడు. మహేష్‌బాబు కథకు ఎప్పుడు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేనో, ఎప్పుడు సినిమా పట్టాలెక్కేనో, సినిమా ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు వచ్చేనో అంటూ ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

2020 వరకు సినిమా కోసం ఆగాల్సిందే అనే టాక్‌ వినిపిస్తుంది.