క్రియేటివ్ టాలెంటెడ్ దర్శకుడు సుకుమార్ రంగస్థలం సినిమా నుంచి తన స్టైల్ ని కాస్తా మార్చేశాడు.ఇంటెలిజెంట్ స్టోరీస్ కాకుండా ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యే మాస్ కథలని ఎంచుకున్తున్నాడు.
వాటికి తనదైన స్క్రీన్ ప్లే జోడించి ఎమోషనల్ అండ్ హీరోయిక్ ఎలిమెంట్స్ తో సినిమాని ఆవిష్కరించి వదులుతున్నాడు.ఇక సుకుమార్ తన సినిమాల కోసం హీరోల లుక్, స్టైల్, నేటివిటీ పూర్తిగా మార్చేస్తున్నాడు.
రంగస్థలం సినిమా కోసం రామ్ చరణ్ మాసిన గడ్డంతో పక్కా పల్లెటూరి యువకుడుగా కనిపించాడు.ప్రస్తుతం అల్లు అర్జున్ తో సుకుమార్ పుష్ప సినిమాని తెరకెక్కిస్తున్నాడు.
ఇందులో పుష్పరాజ్ అనే ఓ లారీ డ్రైవర్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ కనిపిస్తున్నాడు.రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో గంధపు చెక్కల స్మగ్లింగ్ ఎలిమెంట్ తో ఈ సినిమాని ఆవిష్కరిస్తున్నాడు.
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగిస్తున్నాడు.
ఇదిలా ఉంటే సుకుమార్ నెక్స్ట్ సినిమాని రౌడీస్టార్ విజయ్ దేవరకొండతో చేయడానికి ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే.ఇండో-పాక్ వార్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా కథాంశం ఉంటుందని గతంలోనే రివీల్ అయ్యింది.ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సైనికుడుగా కనిపిస్తాడని టాక్ వినిపించింది.
ఇక పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా తెరకెక్కుతుందని ప్రకటించారు.అయితే సుకుమార్ ఈ సినిమాని మరికొంత కాలం వాయిదా వేసి పుష్ప తర్వాత వేరొక స్టార్ హీరోతో సినిమా చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది.
మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే సుకుమార్ కి మంచి కథ రెడీ చేయమని చెప్పడం జరిగిందని టాక్.ఈ నేపధ్యంలో సుకుమార్ కూడా ఇప్పటికే ఒక స్టొరీ లైన్ అనుకున్నట్లు తెలుస్తుంది.
విజయ్ దేవరకొండతో చేయబోయే సినిమాకి వంద కోట్ల వరకు బడ్జెట్ పెట్టబోతున్నారు.అలాగే ఎక్కువ రోజుల షూటింగ్ ఉంటుంది.
ఈ నేపధ్యంలోనే దేవరకొండ కంటే ముందుగా మరొక హీరో సినిమా చేయాలని సుకుమార్ ప్లానింగ్ లో ఉన్నట్లు టాక్ వినిపిస్తుంది.