అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ లో నిర్మిస్తున్నారు.
మొదటిగా సింగిల్ పార్ట్ గానే స్టార్ట్ చేసిన కంటెంట్ బలంగా ఉండటంతో రెండు భాగాలుగా చేయాలని సుకుమార్ భావించి ఆ విషయాన్నీ రివీల్ చేశాడు.కేజీఎఫ్ తరహాలో చాప్టర్ 1, చాప్టర్ 2 గా పుష్ప మూవీని డివైడ్ చేశాడు.
కంప్లీట్ గా గంధపు చెక్కల స్మగ్లింగ్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ కథ ఉంటుందనే విషయం తెలిసిందే.ఈ నేపధ్యంలో మొదటి పార్ట్ లో లారీ డ్రైవర్ గా అల్లు అర్జున్ పాత్ర ఉంటుందని, అక్కడి నుంచి స్మగ్లింగ్ కింగ్ పుష్ప రాజ్ గా ఎలా ఎదిగాడు అనే ఎలిమెంట్స్ తో సెకండ్ పార్ట్ ఉంటుందని టాక్ వినిపిస్తుంది.
ఇదిలా ఉంటే కరోనా సెకండ్ వేవ్ కి ముందే ఈ సినిమా మెజారిటీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది.
ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు చేసుకుంటున్నారు.మొదటి పార్ట్ కి సంబంధించి 90 శాతం షూటింగ్ కంప్లీట్ అయ్యిందని, అలాగే రెండో పార్ట్ కి సంబంధించి కథాంశంలో 10 శాతం కంప్లీట్ అయినట్లు తెలుస్తుంది.ఇదిలా ఉంటే కరోనా లాక్ డౌన్ నుంచి ఉపశమనం లభించి షూటింగ్ లకి పూర్తి స్థాయి పర్మిషన్ దొరకగానే పుష్ప రాజ్ చిత్రీకరణ స్టార్ట్ చేయాలని సుకుమార్ భావిస్తున్నాడు.
ఇక సింగిల్ షెడ్యూల్ లో లాగ్ షూట్ పెట్టి మొదటి పార్ట్ అంతా కంప్లీట్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు.దీనికోసం మళ్ళీ ఫారెస్ట్ లోకి వెళ్ళకుండా హైదరాబాద్ లో ప్రత్యేకంగా సెట్స్ వేసి అందులోనే మిగిలిన పార్ట్ మొత్తం పూర్తి చేయాలని భావిస్తున్నారు.
అన్ని అనుకూలంగా జరిగిది జులైలో ఈ షెడ్యూల్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది.