మెగాస్టార్ కోసం కథను రెడీ చేస్తోన్న సుక్కు  

Sukumar Pens Script For Megastar-koratala Siva,megastar,sukumar,telugu Movie News

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమా పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపారు.

Sukumar Pens Script For Megastar-Koratala Siva Megastar Sukumar Telugu Movie News

ఈ సినిమాలో బన్నీ చాలా రఫ్‌లుక్‌లో మనకు కనిపిస్తాడని, ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా నడుస్తుందని చిత్ర యూనిట్ తెలిపారు.కాగా సుకుమార్ ఈ సినిమాను తనదైన శైలిలో తెరకెక్కించి మరో బ్లాక్‌బస్టర్ హిట్‌‌ను అందించేందుకు రెడీ అవుతున్నాడు.

అయితే ఈ క్రమంలో సుకుమార్ మెగాస్టార్ చిరంజీవి కోసం స్క్రిప్టును రెడీ చేసినట్లు తెలుస్తోంది.ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న చిత్రం కోసం రెడీ అవుతున్నాడు.

అయితే ఈ సినిమా తరువాత మెగాస్టార్ తన నెక్ట్స్ మూవీని ఓ రీమేక్ చిత్రంగా తెరకెక్కించనున్నాడు.మలయాళంలో సూపర్ సక్సెస్ కొట్టిన ల్యూసిఫర్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి చిత్ర యూనిట్ రెడీ అవుతున్నారు.

ఇప్పటికే ఈ చిత్ర హక్కులను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొనుగోలు చేయగా, ఈ సినిమాకు స్క్రిప్టును సుకుమార్ అందిస్తున్నట్లు తెలుస్తోంది.అయితే ఈ సినిమాను సుకుమార్ డైరెక్ట్ చేస్తాడా లేదా అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్‌గానే మారింది.

మరి చిరంజీవి సినిమాకు సుకుమార్ స్క్రిప్టు ఎంతవరకు వర్కవుట్ అవుతుందో తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే.

తాజా వార్తలు

Sukumar Pens Script For Megastar-koratala Siva,megastar,sukumar,telugu Movie News Related....