అల్లు అరవింద్‌ నో చెప్పడంతో సుకుమార్‌ మూవీలోకి శరత్‌ మరార్‌ ఇన్వాల్వ్‌ అయ్యాడట..!  

  • కొన్ని రోజుల క్రితం సుకుమార్‌ రైటింగ్స్‌ మరియు గీతాఆర్ట్స్‌ 2 బ్యానర్‌లు కలిసి ఒక సినిమాను నిర్మించేందుకు సిద్దం అయ్యారంటూ వార్తలు వచ్చాయి. ఆ సినిమాకు సూర్యప్రతాప్‌ దర్శకత్వం వహిస్తాడని కూడా వార్తలు వచ్చాయి. సినిమాకు సంబంధించిన చిత్రీకరణ మొదలు పెట్టాలని భావించిన సమయంలో ఆ కథకు అల్లు అరవింద్‌ నో చెప్పాడని, దాంతో బన్నీ వాసు ప్రాజెక్ట్‌ నుండి తప్పుకున్నట్లుగా తెలుస్తోంది. బన్నీ వాసు నో చెప్పడంతో ఆ ప్రాజెక్ట్‌ను సొంతంగానే నిర్మించేందుకు సుకుమార్‌ సిద్దం అయ్యాడు.

  • Sukumar Next Movie With Sharath Marar For His Next-Allu Aravind And Mahesh Sharath Sukumar Mahesh Combo

    Sukumar Next Movie With Sharath Marar For His Next

  • సుకుమార్‌ ప్రస్తుతం మహేష్‌బాబు సినిమాకు దర్శకత్వం వహించేందుకు సిద్దం అవుతున్నాడు. అందుకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ చేస్తున్నాడు. మరో వైపు మైత్రి మూవీస్‌ వారితో కలిసి వైష్ణవ్‌ తేజ్‌ మొదటి సినిమాను తన బ్యానర్‌లో నిర్మిస్తున్నాడు. తాజాగా శరత్‌ మరార్‌ తో కలిసి మరో సినిమాను నాగశౌర్య హీరోగా నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు. ఈ సమయంలోనే సూర్య ప్రతాప్‌ దర్శకత్వంలో మరో సినిమాను కూడా చేసేందుకు సిద్దం అవుతున్నాడు.

  • Sukumar Next Movie With Sharath Marar For His Next-Allu Aravind And Mahesh Sharath Sukumar Mahesh Combo
  • సుకుమార్‌ ఏ సినిమాను కూడా తన సొంతంగా చేయడు. అల్లు అరవింద్‌ నో చెప్పిన కథను శరత్‌ మారార్‌కు వినిపించగా ఆయన ఇంప్రెస్‌ అయ్యాడని, త్వరలోనే ఆ సినిమాను కూడా మొదలు పెట్టాలని భావిస్తున్నారు. సూర్య ప్రతాప్‌ దర్శకత్వంలోనే ఆ సినిమా ఉండబోతుంది. ఒక యంగ్‌ హీరో ఇప్పటికే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడని, త్వరలోనే సినిమా అధికారిక ప్రకటన వస్తుందని అంటున్నారు. అయితే అఫిషియల్‌గా సుకుమార్‌ మాత్రమే ఈ సినిమాకు నిర్మాత అంటూ ప్రకటించబోతున్నారు. అంటే శరత్‌ మరార్‌ పేరు ఈ సినిమాకు వినియోగించరట.