పుష్ప-2 ఐటెం సాంగ్ లో బాలీవుడ్ బ్యూటీ.. సమంత సాంగ్ కి మించేలా ప్లాన్?

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన చిత్రం పుష్ప.ఈ సినిమాకు టాలీవుడ్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహించిన విషయం అందరికి తెలిసిందే.

 Sukumar Interesting Plans For Pushpa 2 Item Song Pushpa, Allu Arjun, Sukumar,-TeluguStop.com

ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ 17న విడుదల అయి బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది.

ప్రపంచ వ్యాప్తంగా దాదాపు మూడు వందల కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది.ఈ సినిమాతో అల్లు అర్జున్ మరొక సూపర్ హిట్ టాక్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.

అయితే ఇందులో సుకుమార్ దర్శకత్వం ఒక ఎత్తు అయితే అల్లు అర్జున్ రష్మిక మందన ఒక ఎత్తు, అదేవిధంగా సమంత ఐటమ్ సాంగ్ మరొక ఎత్తు అని చెప్పవచ్చు.అయితే ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ని చూసిన ప్రేక్షకులు సెకండ్ పార్ట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

ఇక ప్రేక్షకులు, సెలబ్రిటీలు అంచనాలకు మించే విధంగా పుష్ప పార్ట్ 2 ను ప్లాన్ చేస్తున్నారు సుకుమార్.వచ్చేనెల ఫిబ్రవరిలో ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

అందుకు సంబంధించిన సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు సుకుమార్.అయితే అందులో ఉండే రెండవ ఐటెం సాంగ్ కోసం భారీగా కసరత్తులు చేస్తున్నారు సుకుమార్.

Telugu Allu Arjun, Pushpa, Samantha, Sukumar, Tollywood-Movie

ఫస్ట్ పార్ట్ లో టాలీవుడ్ హీరోయిన్ సమంత స్టెప్పులు ఇరగదీయగా భారీగా రెస్పాన్స్ రావడంతో పార్ట్ 2 లో ఐటమ్ సాంగ్ అంతకుమించి ఉండే విధంగా సుకుమార్ ప్లాన్ చేస్తున్నారట.అయితే ఫస్ట్ పార్ట్ లో  సమంతతో ఐటెం సాంగ్ చేయించిన సుకుమార్ సెకండ్ పార్ట్ లో మాత్రం బాలీవుడ్ బ్యూటీ ని రంగంలోకి దించ బోతున్నారని తెలుస్తోంది.ఈ క్రమంలోనే పార్ట్ 2 లో ఐటమ్ సాంగ్ కోసం హీరోయిన్ లను వెతికే పనిలో పడ్డారు సుకుమార్.షూటింగ్ మొదలు పెట్టిన వెంటనే తొలి షెడ్యూల్ లోనే ఐటెం సాంగ్ ఫినిష్ చేయాలని సుకుమార్ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మొదటి పార్ట్ లోనే స్పెషల్ సాంగ్ ఆ రేంజ్ లో ఉన్నప్పుడు ఒక రెండవ భాగం లో ఏ రేంజ్ లో ఉంటుందా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube